రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న పలువురు హీరోయిన్లు తమ కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోసే హీరోగా దుల్కర్ సల్మాన్‌ను చూస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రముఖ భామలు ఇప్పుడు దుల్కర్‌తో చేస్తున్న సినిమాలపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి.
టాలీవుడ్‌కు దూరంగా ఉన్న పూజా హెగ్డే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. వివిధ భాషల్లో వరుసగా వచ్చిన ఫెయిల్యూర్స్ తర్వాత ఆమె తన అలకను పక్కన పెట్టి తిరిగి టాలీవుడ్లో అడుగుపెట్టబోతోందని సమాచారం. డిసెంబర్లో విడుదల కానున్న ‘శ్రీశ్రీ’ చిత్రంతో ఆమె రీఎంట్రీ జరగనుంది. పూజా టాలీవుడ్లోకి అడుగుపెట్టడానికి మార్గం సుగమం చేసిన హీరోల్లో దుల్కర్ సల్మాన్ ఒకరు కావడం విశేషం. ఇప్పుడు ఆమె ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేయగలిగేది కూడా దుల్కర్తోనే చేస్తున్న ప్రాజెక్ట్ అవుతుందా అనే ఆసక్తి నెలకొంది.
ఇటీవల ‘కూలీ’ చిత్రంతో మిక్స్డ్ రివ్యూలను అందుకున్న శృతి హాసన్ కూడా తన తదుపరి ముఖ్యమైన అవకాశంగా దుల్కర్ సల్మాన్‌తో చేస్తున్న సినిమాను చూస్తోంది. ఆ చిత్రంతో తాను హిట్ సాధించానా, లేక ఫ్లాప్ చూశానా అన్న సందిగ్ధంలో ఉన్న శృతి, ఇప్పుడు దుల్కర్‌తో కలిసి చేస్తున్న ‘ఆకాశంలో ఓ తార’లో కీలక పాత్రలో కనిపించనుంది. ‘సలార్’ తర్వాత ‘డెకాయిట్’ ప్రాజెక్ట్‌ను వదులుకోవాల్సి వచ్చిన శృతి, ‘పెద్దిలో’ స్పెషల్ సాంగ్‌లో కనిపించినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఆమె నుంచి రాబోతున్న తదుపరి తెలుగు చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై ఆమెకు ప్రత్యేకమైన నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కయాద్ లోహార్ కూడా వరుస ఫలితాలతో మిశ్రమ అనుభవం పొందుతోంది. ‘ఫంకీ’, ‘పల్లిచట్టంబి’ చిత్రాలు నిరాశపరచగా, ‘ఇదయం మురళి’ మాత్రం విజయాన్ని అందించింది. అయినా సరే, తన కెరీర్‌ను మరింత బలపర్చే స్థాయి సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. ‘డ్రాగన్’ పేరుతో కొన్ని ఆఫర్లను దక్కించుకుంటున్నా, మళ్లీ అదే స్థాయి విజయాన్ని అందుకోవడంలో ఇబ్బంది పడుతోంది.
ఇలాంటి సమయంలో మలయాళంలో దుల్కర్ సల్మాన్‌తో కలిసి చేస్తున్న ‘ఐ యామ్ గేమ్’ చిత్రంపై కయాద్ లోహార్ భారీగా ఆశలు పెట్టుకుంది. ఓనమ్ పండుగ సందర్భంగా విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీతో తాను స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
పూజా హెగ్డే, శృతి హాసన్, కయాద్ లోహార్ – ఈ ముగ్గురు భామల్లో ఎవరికైనా దుల్కర్ సల్మాన్ నిజమైన ‘లక్కీ భాస్కర్’గా మారుతాడా, లేక ముగ్గురి కెరీర్లకు కొత్త మలుపు తీసుకురాగలడా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.







