రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ కలయికలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లడీ రోమియో’పై టాలీవుడ్‌లో భారీ ఆసక్తి నెలకొంది. నిహారిక ఎంటెర్టైమెంట్స్‌తో పాటు నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై నాని, వెంకట్ బోయినపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్టైలిష్ విజువల్స్, నాని సరికొత్త మేకోవర్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన తాజా సమాచారం సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వినిపిస్తున్న వార్తల ప్రకారం, ‘బ్లడీ రోమియో’ చిత్ర ప్రధాన చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబర్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుందని టాక్.
మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఆ తర్వాత లండన్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. లండన్‌లో చిత్రీకరించబోయే కీలక సన్నివేశాలు ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఫిల్మ్ నగర్ టాక్ చెబుతోంది.
ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలిసింది. సుజీత్ మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్ కలగలిపి ఈ సినిమాను రూపొందించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘బ్లడీ రోమియో’ను 2027 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు కలిసి పని చేయబోతున్నారనే వార్త కూడా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
నాని–సుజీత్ కలయికలో వస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని కొత్త లుక్, సుజీత్ యాక్షన్ ట్రీట్‌మెంట్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర కలయికతో ‘బ్లడీ రోమియో’ టాలీవుడ్‌లో మరో పెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.







