రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఈ ఏడాది వచ్చిన ‘కరుప్పు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోయినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. ఆ సినిమా తరువాత సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons)పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సూర్య సరసన రవీనా టాండన్ (Raveena Tandon), మమితా బైజు (Mamitha Baiju) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, కాన్సెప్ట్ పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, సినిమాపై అంచనాలను పెంచాయి.
తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి లిరికల్ సాంగ్‌కు ముహూర్తం ఖరారు చేస్తూ, ‘నేనో బటర్‌ఫ్లై’ అనే పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటంతో, సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ట్యూన్, విజువల్స్, లిరిక్స్ కలయికగా ఈ పాట పూర్తి రూపంలో ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రానికి సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘సార్’ సినిమా ఆల్బమ్ ఎంతటి సంచలనం సృష్టించిందో సినీప్రేమికులకు తెలిసిందే. ఇప్పుడు ‘నేనో బటర్‌ఫ్లై’ ప్రోమో విన్న ప్రేక్షకులు, మరోసారి ఈ కాంబో నుంచి బ్యూటిఫుల్ చార్ట్‌బస్టర్ మెలోడీ రాబోతుందనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.
వీడియోలో సూర్య క్లాసిక్, వింటేజ్ హ్యాండ్సమ్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. మమితా బైజు అతని కింద పనిచేసే ఎంప్లాయ్‌గా కనిపించింది. మోడ్రన్ లుక్‌లో ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ యువ ప్రేక్షకుల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. ఇద్దరి మధ్య కనిపించిన స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీ సినిమాపై ఉన్న హైప్‌ను మరింతగా పెంచింది.
‘నేనో బటర్‌ఫ్లై’ పూర్తి లిరికల్ సాంగ్‌ను జూన్ 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆగస్టులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి సూర్యకు తెలుగులో ఎలాంటి విజయాన్ని ఈ చిత్రం అందిస్తుందో చూడాల్సి ఉంది.







