రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘రోమాంచకం’ నుంచి గ్లింప్స్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుమంత్ ప్రభాస్, అనంతిక శాసిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం, విడుదలైన గ్లింప్స్‌తో సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో లవ్, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్ సమతౌల్యంగా మిళితమై ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. గ్లింప్స్ ప్రారంభంలో వినిపించే కవిత, భావోద్వేగాలతో నిండిన పదాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. జానకి చెంతనే రాముడి హృదయం, ఈ ప్రేమ కావ్యం మృదుమధురం అనే భావరేఖలతో గ్లింప్స్ సాగుతూ, కథలోని ప్రేమ భావనను సూచిస్తోంది.
సుమంత్ ప్రభాస్, అనంతిక మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, మధ్య మధ్యలో వినిపించే కామెడీ డైలాగులు, నవ్వులు ఈ గ్లింప్స్‌ను మరింత లైట్ హార్ట్‌గా మార్చాయి. వీటి ద్వారా సినిమా మొత్తం యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ గ్లింప్స్‌కు డీవోపీ పవన్ పప్పుల అందించిన అందమైన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన మధురమైన మెలొడియస్ ట్యూన్‌తో గ్లింప్స్ సాగుతూ, కథానాయకులు, కథానాయికల మధ్య ఉన్న ప్రేమను, వారి మధ్య ఏర్పడిన దూరాన్ని భావోద్వేగంగా చూపించింది.
అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే — రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే — రోమాంచకం..
గ్లింప్స్‌లో వినిపించిన ఈ లిరిక్స్ ద్వారా సినిమా ఎంత వైబ్రేటింగ్‌గా, భావోద్వేగాలతో నిండిన రొమాంటిక్ ప్రయాణంగా ఉండబోతుందో అర్థమవుతోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక జంట కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని గ్లింప్స్ సూచిస్తోంది.
‘రోమాంచకం’ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విడుదలైన గ్లింప్స్‌తో సినిమా చుట్టూ క్రియేట్ అయిన బజ్, యువ ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలను పెంచుతోంది.







