సినీ నటి సమంత జీవితంలో ప్రస్తుతం ఆనందకరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మరోవైపు సమంత తల్లి కానుందనే వార్తలు సినీ వర్గాల్లో, సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆమె గతంలో తన భవిష్యత్‌ పిల్లల గురించి చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్‌ అవుతున్నాయి.

కొన్నేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తనకు పుట్టే బిడ్డ, కుటుంబ జీవితం గురించి స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మహిళల పాత్ర, బాధ్యతలపై చూపిన దృక్పథం అప్పట్లోనే అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఆ వ్యాఖ్యలు మరోసారి చర్చకు వస్తున్నాయి.

అదే ఇంటర్వ్యూలో సమంత తన చిన్ననాటి అనుభవాలను కూడా పంచుకున్నారు. చిన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు తన ఆలోచనలను ఎలా మార్చాయో వివరించారు..

ఇటీవల జరిగిన ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవ వేడుకల్లో సమంత బేబి బంప్‌తో కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ విషయంపై ఆమె సన్నిహితులను అడగ్గా, సమంత, రాజ్‌ నిడిమోరు దంపతులకు ఇది చాలా ప్రత్యేకమైన సమయమని, ఇద్దరూ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారని వారు వెల్లడించినట్లు సమాచారం. దీంతో సమంత త్వరలోనే శుభవార్తను అధికారికంగా ప్రకటిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

‘మా ఇంటి బంగారం’ విజయంతో సమంత కెరీర్‌ మరోసారి ఊపందుకుంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ.43 కోట్లు వసూలు చేయగా, నార్త్‌ అమెరికాలో వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరింది. సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన రీల్స్‌, క్లిప్స్‌ విస్తృతంగా పంచుకుంటున్నారు.

ఈ విజయంపై నటి నయనతార కూడా సమంతకు శుభాకాంక్షలు తెలిపారు. సమంత ఈ విజయానికి అర్హురాలని నయనతార పేర్కొనగా, సమంత ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో స్పందించారు. వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో సమంత కొత్త దశలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆమె పాత వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి.