2026లో ఇప్పటికే ఏడు నెలలు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఫస్టాఫ్‌లో సంక్రాంతి సీజన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంతృప్తికరమైన ఫలితాలు సాధించగలిగాయి. అయితే సమ్మర్ సీజన్ మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. జూన్, జులై నెలల్లో ఎన్నో అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయాయి. మరికొన్ని సినిమాలు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా నిలదొక్కుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

అయితే ఈ ఏడాది ఆగస్ట్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. ఈ నెలలో టాలీవుడ్ ప్రేక్షకుల కోసం రోలర్ కోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ సిద్ధమవుతున్నాయి. ఫస్ట్ వీక్‌లోనే వరుణ్ తేజ్ నటించిన హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 7న కొరియన్ కానగరాజ్ విడుదల కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో పాటు, అదే రోజు కింగ్ జాకీ క్వీన్ అనే మరో చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. రైసింగ్ హీరోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా, మెగా హీరో నటించిన కొరియన్ కానగరాజ్ తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.

ఆగస్ట్‌లో రెండో వీకెండ్ చాలా కీలకంగా మారనుంది. ఇండిపెండెన్స్ డే హాలీడేస్‌ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్ నుండి చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో, తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కోర్టురూం డ్రామా పల్లబిరుసు అదే రోజు విడుదల కానుంది. అలాగే ఒన్స్ అపాన్ ఆ టైం విజయవంతమైన నిర్మాత MS రాజు దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ మూవీ అగాధ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మూడో శుక్రవారం డివోషనల్ వీక్‌గా మారనుంది. మాస్ మహారాజ్ రవి తేజ ఇరుముడి చిత్రంతో భిన్నమైన పాత్రలో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. శివ నిర్వాణం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 21న విడుదల కానుంది.

ఆగస్ట్ చివరి శుక్రవారం శర్వానంద్ బోగి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గానీ, గ్లింప్సె గానీ విడుదల కాలేదు. అధికారికంగా పోస్టుపోన్ ప్రకటన వెలువడనప్పటికీ, అనధికారికంగా మాత్రం ఆగస్ట్ 28న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం తక్కువగా ఉందనే మాట తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వినిపిస్తోంది.