దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన Flydubai విమానంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కో-పైలట్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో భారత సంతతి కెప్టెన్ స్మిత్ మచ్చార్ తీవ్ర గాయాలపాలయ్యారు. అయినప్పటికీ అసాధారణ ధైర్యసాహసంతో స్పందించిన ఆయన, విమానాన్ని కాపాడి 174 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను రక్షించారు.

Boeing 737 Max-8 విమానం గాల్లో ఉండగా, ఒమాన్ జాతీయుడిగా భావిస్తున్న కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. విమాన నియంత్రణ వ్యవస్థలను ధ్వంసం చేసి, విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కో-పైలట్‌ను అడ్డుకునే క్రమంలో తీవ్ర గాయాలపాలైన కెప్టెన్ స్మిత్, విమానం వేగంగా కిందికి దూసుకెళ్తున్న సమయంలో కూడా చాకచక్యంగా cockpit తలుపు అన్లాక్ చేసి సహాయం కోసం కేకలు వేసినట్లు వెల్లడైంది.

ఆ సమయంలో విమానం కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14,000 అడుగుల మేర కిందికి దూసుకెళ్లినట్లు విమానయాన వర్గాలు పేర్కొంటున్నాయి. విమానం తీవ్ర కుదుపులకు లోనవడం, అరుపులు వినిపించడంతో అప్రమత్తమైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే కాక్పిట్ వైపు పరుగులు తీశారు.

ప్రయాణికుల చాకచక్యంతో కో-పైలట్ అదుపులో

కాక్పిట్ లోకి చొరబడిన ప్రయాణికులలో Yaniv అనే ఇస్రేల్ ప్లంబర్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. టెలివిజన్‌లో ప్రసారమయ్యే ఎయిర్ డిజాస్టర్స్ కార్యక్రమాలు చూసి విమానాల నియంత్రణపై ప్రాథమిక అవగాహన పెంచుకున్నట్లు Yaniv పేర్కొన్నారు. ఇతర ప్రయాణికులతో కలిసి విధ్వంసానికి పాల్పడుతున్న కో-పైలట్‌ను కుర్చీ నుంచి వెనక్కి లాగి బంధించినట్లు సమాచారం.

అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్లు, భద్రతా సిబ్బంది వెంటనే కాక్పిట్ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుని విమానాన్ని అదుపులోకి తెచ్చారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియా లోని టబుకి విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దాదాపు ఎనిమిది గంటల నిరీక్షణ అనంతరం ప్రయాణికులను మరో ప్రత్యామ్నాయ విమానంలో టెల్ Aviv‌ కు తరలించారు.

స్మిత్ ధైర్యానికి ప్రపంచ నేతల ప్రశంసలు

కెప్టెన్ స్మిత్ మచ్చార్ ప్రదర్శించిన అద్భుత ధైర్యసాహసాన్ని ప్రపంచ నేతలు కొనియాడారు. ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ స్మిత్‌ను “real hero”గా అభివర్ణించారు.

“Smith చాలా తీవ్రమైన గాయాలపాలైనా సమయస్ఫూర్తితో వ్యవహరించి real heroగా నిలిచారు. ఇదొక అద్భుతమైన సంఘటన” అని Donald Trump అన్నారు.

ఇజ్రాయెల్ ప్రధాని Netanyahu కూడా Xలో పోస్ట్ చేస్తూ, తీవ్రంగా గాయపడినా వెనకడుగు వేయకుండా ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ అసాధారణ ధైర్యానికి తన salutéని తెలియజేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Smith‌ ను అత్యంత నైపుణ్యం కలిగిన వీరుడిగా అభివర్ణిస్తూ, India–Israel–UAE తరఫున ఆయన క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు భారత్లోని Israel రాయబారి వెల్లడించారు.

ఎవరు కెప్టెన్ స్మిత్ మచ్చార్?

గుజరాత్ కు చెందిన స్మిత్ మచ్చార్ కమర్షియల్ ఏవియేషన్ రంగంలో పదేళ్లకు పైగా అనుభవం కలిగిన పైలట్. June 2011 నుంచి 2022 వరకు దాదాపు 11 ఏళ్లపాటు భారత విమానయాన సంస్థ SpiceJet‌ లో పనిచేశారు. జూన్ 2022లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్ గా ఫ్లై దుబాయ్ లో చేరారు.

Boeing 737 విమానాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల్లో స్మిత్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉంది. Welingkar ఇన్స్టిట్యూట్ అఫ్ మనగెమెంత్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పొందారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ఆయన కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు భారత దౌత్య కార్యాలయం తెలిపింది.