రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని భారత వాయుసేన (Indian Air Force) ఎయిర్‌మెన్ ఇంటేక్ 02/2027 కింద గ్రూప్-‘వై’ (నాన్-టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష అభ్యర్థులు జులై 26, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

పోస్టు పేరు

గ్రూప్-‘Y’ (నాన్-టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ (Airmen Intake 02/2027)

విద్యార్హతలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి.

  • 10+2 / ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా ఇదే సబ్జెక్టులతో రెండేళ్ల వృత్తి విద్య (Vocational Course) పూర్తి చేసి ఉండాలి.

  • లేదా డిప్లొమా ఫార్మసీ, బీ.ఫార్మసీ లేదా బీఎస్సీ (ఫార్మసీ) పూర్తి చేసి, నియామక సమయానికి స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ లేదా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI)లో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.


వయోపరిమితి

ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేసుకునేవారు:

  • 1 జులై 2006 నుంచి 1 జులై 2010 మధ్య జన్మించి ఉండాలి.

డిప్లొమా/బీ.ఫార్మా/బీఎస్సీ (ఫార్మసీ) అభ్యర్థులు:

  • అవివాహితులు: 1 జులై 2003 నుంచి 1 జులై 2008 మధ్య జన్మించి ఉండాలి.

  • వివాహితులు: 1 జులై 2003 నుంచి 1 జులై 2006 మధ్య జన్మించి ఉండాలి.

వేతనం

  • శిక్షణ సమయంలో నెలకు రూ.14,600 స్టైపెండ్ అందుతుంది.

  • శిక్షణ పూర్తైన తర్వాత ప్రారంభ వేతనం రూ.26,900తో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.


ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపికను మూడు దశల్లో నిర్వహిస్తారు.

  • ఫేజ్-1: ఆన్‌లైన్ రాత పరీక్ష

  • ఫేజ్-2: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PET), అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2, సర్టిఫికేట్ వెరిఫికేషన్

  • ఫేజ్-3: వైద్య పరీక్షలు, తుది మెరిట్ జాబితా

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.550 + జీఎస్‌టీ చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుకు చివరి తేదీ: 26 జులై 2026

  • ఆన్‌లైన్ పరీక్షలు: 22, 23 సెప్టెంబర్ 2026

  • ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్: మే 2027 చివరి వారం

  • ఎన్‌రోల్‌మెంట్ లిస్ట్ విడుదల: 1 జూన్ 2027

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత కలిగిన అభ్యర్థులు భారత వాయుసేన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హతలు, వయోపరిమితి, అవసరమైన పత్రాలను ఒకసారి తప్పకుండా పరిశీలించడం మంచిది.