రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: ISRO టెలీమెట్రి ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ISRO ISTRAC)లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెక్షన్ కంట్రోలర్ హోదాలో మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించింది.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో 23, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 28, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 3, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 4, సివిల్ ఇంజినీరింగ్‌లో 1, లైబ్రరీ సైన్స్ (MLISc)లో 2, BSc CS/ITలో 1 పోస్టు ఉన్నాయి.
డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ విభాగంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో 7, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 6, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 3, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 3, సివిల్ ఇంజినీరింగ్‌లో 1, కమర్షియల్ ప్రాక్టీస్‌లో 5 ఖాళీలు ఉన్నాయి.
ITI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 4, మెషినిస్ట్ 1, ఎలక్ట్రికల్ 1, IT–TSM 1, ఫిట్టర్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతల విషయానికి వస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 20 నుంచి 33 ఏళ్ల మధ్యగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ జూలై 17 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 8గా నిర్ణయించారు. నిర్ణీత గడువులోపు అవసరమైన వివరాలు, ధ్రువపత్రాలతో పాటు అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలి.
ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలు వంటి సమాచారం కోసం అభ్యర్థులు ISRO అధికారిక వెబ్సైట్ www.isro.gov.in ను సందర్శించవచ్చు.







