రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2026 సంవత్సరానికి గాను జూనియర్ ఇంజనీర్ (JE) తదితర పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో మొత్తం 3,993 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సాంకేతిక విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.

ఈ నియామక ప్రక్రియలో జూనియర్ ఇంజనీర్ , డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ , కెమికల్ అండ్ Metallurgical అసిస్టెంట్ , కెమికల్ సూపెర్వైసోర్ / రీసెర్చ్ Metallurgical సూపెర్వైసోర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ), బీఎస్సీ వంటి అర్హతలు అవసరం. అభ్యర్థులు తమ విద్యార్హతను పోస్టు ప్రకారం పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

వయస్సు పరంగా చూస్తే 01-01-2027 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నియమాల ప్రకారం SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 నుండి 15 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు వర్తిస్తుంది. కొన్ని వర్గాలకు ఉన్న ఈ సడలింపు వివరాలు నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఇవ్వబడ్డాయి.

వేతన పరంగా కెమికల్ సూపెర్వైసోర్ / రీసెర్చ్ Metallurgical సూపెర్వైసోర్ పోస్టులకు ప్రారంభ వేతనం రూ.44,900గా, జూనియర్ ఇంజనీర్ , డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ , కెమికల్ అండ్ Metallurgical అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400గా నిర్ణయించారు. వీటికి అదనంగా రైల్వే శాఖ నియమాల ప్రకారం అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-1, CBT-2) నిర్వహిస్తారు. పరీక్షల్లో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ , అనంతరం మెడికల్ ఎక్సమినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ప్రతి దశలో అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in ద్వారా అప్లై చేయాలి. ముందుగా వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసి, OTP ద్వారా వెరిఫై చేసుకోవాలి. అనంతరం తమ RRB Zone, ఇంజినీరింగ్ బ్రాంచ్, విద్యార్హత, కేటగిరీ వివరాలు నమోదు చేసి, ఫోటో, డిజిటల్ సంతకం అప్లోడ్ చేయాలి.

దరఖాస్తు సమయంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. జనరల్ , OBC, EWS అభ్యర్థులకు రూ.500, SC, ST, ESM, Ex- సర్వీస్ మెన్ , మహిళా అభ్యర్థులకు రూ.250 ఫీజు నిర్ణయించారు. ఫీజు చెల్లింపు అనంతరం అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలని RRB సూచిస్తోంది.

ఈ నియామకానికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ ఆగస్టు 13, 2026గా, చివరి తేదీ సెప్టెంబర్ 13, 2026గా నిర్ణయించారు. నోటిఫికేషన్ PDF, ఆన్లైన్ అప్లై లింక్, ఇతర వివరాలు RRB అధికారిక వెబ్‌సైట్‌తో పాటు apgovtschemes.com లో కూడా అందుబాటులో ఉన్నాయి.

https://apgovtschemes.com/rrb-je-recruitment-2026-apply-now/