రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 13 వేల 745 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునే గడువును ఐబీపీఎస్ పొడిగించింది. అభ్యర్థులు సెప్టెంబర్ 27, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకాల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1, స్కేల్-2, స్కేల్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు.గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి వయోపరిమితి, ఇతర అర్హతలు మారవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 175 రూపాయలు కాగా.. మిగతా అభ్యర్థులకు 850 రూపాయలుగా నిర్ణయించారు.ఈ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలను 2026 నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్నట్లు ఐబీపీఎస్ తెలిపింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేపడతారు.
అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 27లోపు ibps.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.







