రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మరో అవకాశం లభించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని DIET ( డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ )ల్లో లెక్చరర్ , సీనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 86 ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాల్లో పంపే దరఖాస్తులను స్వీకరించరు.
దరఖాస్తుల స్వీకరణ జూన్ 24, 2026 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 29, 2026 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు విషయంలో OC, BC వర్గాల అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. SC, ST, PwD అభ్యర్థుల కోసం ఫీజు రూ.500గా నిర్ణయించారు. అదనంగా ప్రతి అభ్యర్థి నుంచి ఎగ్జామినేషన్ ఫీజు రూపంలో రూ.120 వసూలు చేస్తారు.
ఈ నియామకాలకు సంబంధించి రాతపరీక్షను సెప్టెంబర్ 2026లో నిర్వహించనున్నారు. ఖచ్చితమైన పరీక్ష తేదీని TGPSC త్వరలో ప్రకటిస్తుంది. హాల్ టికెట్లను పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు ముందురోజు సాయంత్రం 5 గంటల వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ఎగ్జామ్ సెంటర్లు హైదరాబాద్ (HMDA పరిధి), కరీంనగర్ , ఖమ్మం , నిజామాబాదు , వరంగల్ నగరాల్లో ఏర్పాటు చేస్తారు. పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్–1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ Abilitiesకు సంబంధించిన 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది.
పేపర్–2ను Part–A, Part–Bగా విభజించారు. ప్రతి పార్ట్‌లో 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పార్ట్‌కు 150 నిమిషాల సమయం, 150 మార్కులు. అంటే ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ఈ ప్రశ్నపత్రం కూడా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మల్టీ జోన్–1, మల్టీ జోన్–2ల వారీగా సీనియర్ లెక్చరర్ , లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తారు. సీనియర్ లెక్చరర్ , DIET ప్రీ ప్రైమరీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ , ఇన్ సర్వీస్ ప్రొగ్రమ్మె ఫీల్డ్ ఇంటరాక్షన్ ఇన్నోవేషన్ & కోఆర్డినేషన్ , డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్ , ప్లానింగ్ & మనగెమెంత్ , ఎడ్యుకేషన్ l టెక్నాలజీ , వర్క్ ఎక్స్పీరియన్స్ , Curriculum మెటీరియల్ డెవలప్మెంట్ & ఎవాల్యూయేషన్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అదనంగా ఎడ్యుకేషన్ , ఇంగ్లీష్ , తెలుగు , ఉర్దూ , మత్ , సైన్స్ , సోషల్ స్టడీస్ , ఫిలాసఫీ , సైకాలజీ , ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ , ఆర్ట్స్ ఎడ్యుకేషన్ , ఎడ్యుకేషన్ టెక్నాలజీ , ఫిసికల్ ఎడ్యుకేషన్ తదితర సబ్జెక్టుల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు కల్పిస్తారు. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు (కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మినహా) 5 ఏళ్లు, మాజీ సైనికులు, NCC అభ్యర్థులకు 3 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
విద్యార్హతల విషయంలో పోస్టు, సబ్జెక్టు ఆధారంగా అర్హతలు మారుతాయి. సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. చాలా పోస్టులకు M.Ed అర్హత తప్పనిసరి. ప్రతి పోస్టుకు అవసరమైన ఖచ్చితమైన విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్లో పొందుపరిచారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు.
జీతభత్యాల పరంగా ఈ పోస్టులు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా పరిగణించబడతాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు కనీసం రూ.54,220 నుంచి గరిష్ఠంగా రూ.1,33,630 వరకు వేతనం లభిస్తుంది. ప్రాథమిక జీతంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.







