వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (VAS) పోస్టుల నియామకాలను ఇకపై ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షను తప్పనిసరి చేసింది.

ఇప్పటి వరకు ఇతర విధానాల ద్వారా భర్తీ చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను, ఇకపై ఏపీపీఎస్సీ పరిధిలోకి తీసుకొచ్చినట్టు అధికారిక సమాచారం వెల్లడించింది. దీనితో నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా, పోటీ ఆధారంగా సాగనుంది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ విడుదల చేసే నోటిఫికేషన్, పరీక్ష విధానం, సిలబస్, అర్హత ప్రమాణాలను పరిశీలించి సిద్ధం కావాల్సి ఉంటుంది.

ఇక యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ట్రిపుల్ ITలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

డిసెంబరు 1 నుంచి 5 వరకు CBT పరీక్షలు జరగనున్నాయి. ఏ రోజు ఏ సబ్జెక్టు కు పరీక్ష నిర్వహించనున్నారో వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అభ్యర్థులు తమ సబ్జెక్టు కు సంబంధించిన పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వంటి వివరాలను ముందుగానే తెలుసుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.

స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను ఏపీపీఎస్సీ సంబంధిత యూనివర్సిటీ కు అందజేస్తుంది. అనంతరం యూనివర్సిటీ, ట్రిపుల్ ITలు తమ నియామక నియమావళి ప్రకారం మర్క్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వూస్ నిర్వహించనున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ లో సాధించిన మార్కులు, ఇతర అర్హతల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నిర్ణయాలు కీలక అవకాశంగా భావిస్తున్నారు. వెటర్నరీ, అకాడెమిక్ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలు ముఖ్యమైన వేదికగా నిలవనున్నాయి.

అభ్యర్థులు APPSC అధికారిక వెబ్సైటు లో విడుదలయ్యే నోటిఫికెషన్స్ , పరీక్ష తేదీలు, అర్హతలు, దరఖాస్తు విధానం, fee వివరాలను తప్పనిసరి గా పరిశీలించి, నిర్దేశిత గడువులోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలకు హాజరయ్యే ముందు సిలబస్ , ఎక్సమ్ పాటర్న్ , ప్రీవియస్ పేపర్స్ వంటి వివరాలను అధ్యయనం చేసి, సమగ్రంగా సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.