రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు: APJAC అమరావతి కర్నూల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాంప్లెక్స్ ఆవరణలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో మంగళవారం లంచ్ హౌర్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ, తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
కలెక్టరేట్ పరిసరాల్లో ఉన్న అన్ని విభాగాల కార్యాలయాలను సందర్శించిన నాయకులు, ఉద్యోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏకగ్రీవంగా తమ అభ్యర్థనలను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో APJAC అమరావతి రాష్ట్ర అబ్సర్వర్ మురళీకృష్ణ నాయుడు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రెసిడెంట్ రంగారెడ్డి, హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ నుండి నారాయణ, APSRTC నుండి మహేష్, శ్రీనివాస్ గౌడ్, వెటర్నరీ అసోసియేషన్ నుండి రామచంద్రరెడ్డి, అనీష్, లక్ష్మణ్, RTC కార్మిక పరిషత్ నుండి మోహన్, మునిసిపల్ ఉద్యోగుల నుండి నవీన్, DRDA నుండి సంగం శ్రీనివాసులు, గిడ్డయ్య, కూపెరటివే నుండి నాగరమణయ్య, పద్మావతి, SLTA నుండి బాలన్న, VRAల నుండి చిన్నస్వామి, థాయప్ప, నరసన్న పాల్గొన్నారు.
అలాగే APRSA జిల్లా కార్యదర్శి వెంకటరాజు, ట్రేసర్ర్ సునీల్ కుమార్, APJAC అమరావతి మహిళా విభాగం ఛైర్పర్సన్ సహారా బాను, పద్మావతి, మల్లేశ్వరి, కర్నూల్ డివిజన్ ప్రెసిడెంట్ ధనుంజయరెడ్డి, జిల్లా నాయకులు జగదీశ్, శివపార్వతి, సునీత, సంధ్య, మహేశ్వరీ, రేచల్, సుధాకర్, హుస్సేన్, సూపరింటెండెంట్ సరస్వతమ్మ, EDT ధనుంజయ, ఖాజా ప్రీతం, రాజు నాయక్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాల సమన్వయంతో జరిగిన ఈ లంచ్ HOUR నిరసనలో, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చెందిన సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కరపత్రాల ద్వారా తమ సమస్యలు, డిమాండ్లను వివరించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం కొనసాగింది. నిరసన అనంతరం నాయకులు ఉద్యోగులతో సమావేశమై, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంఘాల వర్గాలు సూచించాయి.













