రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని TIDCO నివాస గృహాల వద్ద మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ సీఐ నాగరాజురావు సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఒక ప్రజాప్రతినిధి పోలీసు సిబ్బంది, విద్యార్థులతో కలిసి స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా హరిత వాతావరణం, పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అవగాహన పెంచేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
మన పోలీసు సిబ్బందితో మరియు ఉత్సాహంగా ముందుకు వచ్చిన విద్యార్థులతో కలసి స్వయంగా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని తెలియజేశాను. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని పిల్లల్లా కాపాడుకుంటూ పెంచడం చాలా ముఖ్యం.
మన భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కానుకగా అందించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చాను.
పర్యావరణ సమతుల్యత కోసం ముందడుగు వేస్తూ ఈ మంచి హరిత కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసు అధికారులకు, సిబ్బందికి, ఉత్సాహంగా పాల్గొన్న మున్సిపల్ అధికారులకు, విద్యార్థులకు మరియు మన ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక అభినందనలు.
కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు, మున్సిపల్ అధికారులు, విద్యార్థులు TIDCO నివాస గృహాల పరిసరాల్లో పలు రకాల మొక్కలను నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను స్థానికులకూ అప్పగిస్తూ, వాటిని క్రమం తప్పకుండా నీరు పోసి, సంరక్షించాలని అధికారులు సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇలాంటి హరిత కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించాలని, ప్రతి కాలనీలో, ప్రతి విద్యాసంస్థలో కనీసం ఒక్క హరిత కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఆళ్లగడ్డ ప్రాంతంలో పచ్చదనం పెంపు, కాలుష్య నియంత్రణకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.













