రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (Public Grievance Redressal System)" కార్యక్రమంలో మొత్తం 120 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఈ వేదిక ద్వారా పోలీసు అధికారులకు తెలియజేశారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా వినిపించి, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చట్ట పరిధిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
చట్ట పరిధిలో న్యాయం చేస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నాము. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం వహించరాదని సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని ఆయన సూచించారు. అలాగే, ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును సక్రమంగా నమోదు చేసి, వాటి పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఎస్పీ సూచించారు. ఇప్పటికే పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి సమయానికి అందజేయాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
జిల్లా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినిపించి, వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమం ద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను భయపడకుండా, సంకోచం లేకుండా పోలీసులకు తెలియజేయాలని, చట్ట పరిధిలో వారికి న్యాయం చేయడానికి పోలీసు శాఖ కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ మరోసారి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల స్వీకరణ, పరిశీలన, తదుపరి చర్యలపై వారికి అవసరమైన సూచనలు ఇవ్వబడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.













