రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రాధాన్యతతో పరిగణించి, జాప్యానికి తావులేకుండా తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’’లో భాగంగా ఆళ్లగడ్డలో నిర్వహించిన కార్యక్రమానికి 1,508 ఫిర్యాదులు అందాయన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలో 387, సర్వే శాఖ పరిధిలో 150 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పాఠశాలల సమీపంలో రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.
రెవెన్యూ సమస్యలే అధికం: నంద్యాల జిల్లాలో పెండింగ్ ఫిర్యాదులపై కలెక్టర్ రాజకుమారి ఆదేశాలు
నంద్యాల జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు అధికంగా ఉన్నాయని, వాటిని ప్రాధాన్యతతో తీసుకుని జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’లో భాగంగా ఆళ్లగడ్డలో నిర్వహించిన కార్యక్రమానికి 1,508 ఫిర్యాదులు అందగా, అందులో రెవెన్యూ శాఖకు 387, సర్వే శాఖకు 150 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పాఠశాలల సమీప రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.

- రాయలసీమ న్యూస్ - నంద్యాల, నంద్యాల
▸ తాజా నంద్యాల జిల్లా వార్తలు మరియు తెలుగు వార్తలు చదవండి.
Published : 02 Jun 2026, 18:52 IST
గమనిక: ఈ కథనంలోని అభిప్రాయాలు, వ్యాఖ్యలు సంబంధిత వ్యక్తులవి. ప్రకటనలు/వాణిజ్య సమాచారం విషయంలో పాఠకులు తగిన జాగ్రత్త వహించాలి; వాటి నాణ్యత లేదా లోపాలకు రాయలసీమ న్యూస్ యాజమాన్యం బాధ్యత వహించదు. సవరణల కోసం సవరణల విధానం చూడండి.












