ప్రపంచ శాంతి కోసం దలైలామా కృషి ప్రశంసనీయం

: ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

టిబెట్‌కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్ చేశారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల కోసం దలైలామా కృషి ప్రశంసనీయమని కొనియాడారు.

చంద్రబాబు పోస్ట్..

‘శాంతి, కరుణ, మానవత్వానికి దలైలామా ప్రతీక. దశాబ్దాలుగా ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా. దయ, జ్ఞానం, అహింసను ఆచరించాలని దలైలామా సందేశం. ప్రపంచ శాంతి, మానవ హక్కుల కోసం దలైలామా కృషి ప్రశంసనీయం. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలి. శాంతి, కరుణ వ్యాప్తి చేసే దలైలామా సేవలు చిరస్మరణీయం. దలైలామా తన మహోన్నత సేవలను మరింత కాలం కొనసాగించాలి’ అని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.