రాయలసీమ న్యూస్, హరోస్కోప్ డెస్క్: జూన్ 20, 2026 శనివారానికి సంబంధించిన రాశిఫలాల ప్రకారం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి గ్రహస్థితులు అనుకూలంగా, కొంతవరకు మిశ్రమ ఫలితాలతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురు, బుధ, శుక్ర, రవి, కుజ, శని గ్రహాల సంచారం, బలం ఆధారంగా ఆర్థిక, వృత్తి, ఆరోగ్య, కుటుంబ రంగాల్లో మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు, బుధ, శుక్ర గ్రహాల అనుకూలతతో ఆదాయం, ఆరోగ్యం రెండింటిలోనూ లోటు కనిపించదు. ఆర్థికంగా రోజంతా సంతృప్తికరంగా సాగుతుంది. చిన్ననాటి మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులకు చేరువవుతారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. కుటుంబ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండొచ్చు. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామికి అదృష్టం కలిసివస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు, ధనాధిపతి బుధుడు అనుకూలంగా ఉండడంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవడంతో ఒత్తిడి తగ్గుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అవకాశముంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ అవసరం.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉండడంతో అనేక విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. బంధువుల ద్వారా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో కృషి, ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు భారీగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
గురు, బుధ, శుక్ర గ్రహాల అనుకూలతతో రోజు సాఫీగా, ఆనందంగా గడుస్తుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనివ్వొచ్చు. ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పట్టుదలతో ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను చక్కబెట్టగలుగుతారు. ఉద్యోగంలో ఆశించిన శుభవార్త వినే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఇతరులకు సహాయం చేసే అవకాశం వస్తుంది. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా ఉంటుంది. ఆస్తి వివాదం సానుకూల దిశగా మారుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గురు, బుధ, శుక్రుల అనుకూలతతో ఆదాయం పెరగడం, రుణభారం తగ్గడం, మంచి పరిచయాలు ఏర్పడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఇబ్బందులు తగ్గుతాయి. అయితే మిత్రుల వల్ల ఆర్థిక నష్టం కలగొచ్చు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో మాత్రం పోటీదారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యం కొద్దిగా తగ్గుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినొచ్చు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రవి, కుజ, శనులు అనుకూలంగా ఉండడంతో ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం ఆశించినంతగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అధికార యోగం కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రవి, కుజ, గురు గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా, ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ప్రధాన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించగలుగుతారు. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రవి, బుధుల సంచారం అనుకూలంగా ఉండడంతో వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధ్యమవుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. రాదనుకున్న డబ్బు కొద్దిపాటి ప్రయత్నంతో లభిస్తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛస్థితిలో ఉండడంతో ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా, తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుంటారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
శని, గురు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆశించిన ప్రతిఫలం ఉన్నప్పటికీ, వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తాయి. స్వలాభానికి ఉపయోగించుకునే వారి వల్ల నష్టపోతారు. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా బాగా కలసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరు గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.







