హోరోస్కోప్ టుడే (జూలై 4, 2026): గ్రహస్థితుల ప్రభావంతో శనివారంనాడు కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాల్లో శుభఫలితాలు కనిపించనున్నాయి. మరికొందరికి కుటుంబ సుఖసంతోషాలు, కొత్త అవకాశాలు, శుభవార్తలు లభించే సూచనలు ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఈ రోజు దినఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి లాభం పొందుతారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై శ్రద్ధ పెడతారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి మార్గాలు కలిసి వస్తాయి. కుటుంబానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఒకరి ఇద్దరు మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం కలగవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టే పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు బంధువులను ఆర్థికంగా ఆదుకుంటారు. వృత్తి జీవితంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపించే స్థాయిలో సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యాలు, ఉచిత సహాయాలకు ఇది సమయం కాదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శుభగ్రహాల అనుకూలత వల్ల రోజంతా అనుకూలంగా, సంతృప్తికరంగా గడుస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కూడా వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సొంత ఆలోచనల వల్ల లాభం కలుగుతుంది. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త అందుతుంది. ఇష్టమైన మిత్రులతో విందులో పాల్గొంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. వ్యాపారాల్లో కొత్త పద్ధతులు అనుసరిస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. రాజీమార్గంలో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సరైన స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు వస్తాయి. ముఖ్యమైన కార్యకలాపాలన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరికీ హామీలు ఇవ్వకుండా ఉండటం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత ఒకటి సమస్య పరిష్కారమవుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. చేపట్టిన పనుల్లో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు పెడతారు. ప్రముఖులతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశాంత, ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.