రాయలసీమ న్యూస్, హరోస్కోప్ డెస్క్:
జూన్ 23, 2026 రాశిఫలాలు
ఉద్యోగ పురోగతి.. ఆర్థిక జాగ్రత్తలు అవసరం
జూన్ 23, 2026 మంగళవారం రోజున గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండనున్నాయని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక లాభాలు, కుటుంబ సహకారం కొందరికి లభించనున్నాయని చెబుతున్నారు. మరోవైపు కొన్ని రాశుల వారు కీలక నిర్ణయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందో వివరాలు ఇలా ఉన్నాయి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలలో అంచనాలకు మించిన లాభాలు పొందే అవకాశం ఉంది. వాహన యోగం కలుగొచ్చు. ఆర్థికాభివృద్ధికి అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ పరంగా ఒకటి రెండు ఆశలు నెరవేరే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు శుభవార్త వినిపించే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగుతుంది. అయితే అధికారులతో వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలను జాగ్రత్తగా చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం, ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
జీవిత భాగస్వామి తోడ్పాటుతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆదాయ ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి సాధిస్తాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మీ వల్ల బంధుమిత్రుల్లో కొందరు లాభం పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా జీవిత భాగస్వామిపై ఖర్చులు కొంత పెరుగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో ఆశించిన శుభవార్త అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడిపరంగా పైచేయి సాధిస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల చదువులు, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కొద్దిపాటి శ్రమతోనే ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యమైన లావాదేవీలు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా కదులుతాయి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త కార్యక్రమాలు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అడ్డంకులు తక్కువగా ఉంటాయి. దాంపత్య జీవితం సౌఖ్యంగా సాగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేరతాయి. అధికార వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి కొంత ఊరట లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొందరు బంధువులు, సన్నిహితులతో ఏర్పడ్డ వివాదాలు సమసిపోయే అవకాశం ఉంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పిల్లల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. మిత్రుల వల్ల కొద్దిపాటి ధననష్టం జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో చిన్న చిన్న సమస్యలు, చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కరించుకునే దిశగా కదులుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావచ్చు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు కొంత మేరకు ఫలిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలు ఇస్తాయి. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. తలపెట్టిన పనుల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందే సూచనలు ఉన్నాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
వృత్తి, ఉద్యోగాలు ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోతాయి. వ్యాపారాల్లో కూడా సంపాదన బాగా నిలకడగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు కొంత మేరకు సఫలం అవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరంగా అదనపు బాధ్యతలు మీద పడతాయి. కొత్త ఉద్యోగం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సజావుగానే సాగిపోతాయి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కొద్దిపాటి చికాకులు ఉండవచ్చు. బంధువుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం మంచిది. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన సంస్థల నుంచి సానుకూలస్పందన లభిస్తుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.







