జూన్ 25, 2026 రాశిఫలాలు: గురువారం 12 రాశులపై గ్రహాల ప్రభావం ఎలా?

హైదరాబాద్: జూన్ 25, 2026 గురువారం రోజు 12 రాశుల వారికి గ్రహస్థితులు అనుకూలంగా, కొన్ని రాశుల వారికి సవాళ్లతో కూడిన విధంగా ఉండనున్నాయి. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం వంటి అంశాలపై ఈ రోజు గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో జ్యోతిష్య విశ్లేషణ ఇలా ఉంది.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టే పరిస్థితి వస్తుంది. ఉద్యోగంలో కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా, ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికార యోగం కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఇంటా బయటా మీ విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో ఉన్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం రెండూ బాగుంటాయి. వృత్తి జీవితం చక్కగా వెలుగుతుంది. అనుకున్న శుభవార్తలు వినే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. కీలక బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి మంచి అవకాశాలు రావచ్చు. ముఖ్యమైన పనులు నిదానంగా అయినా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల్లో కొందరికి ధన సహాయం చేయాల్సి రావచ్చు. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ఊపందుకుంటాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగపరంగా కొంత అదృష్టం కలిసివస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారాలని చూస్తున్న వారికి సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బిజీగా గడుస్తుంది. కొత్త ప్రోత్సాహకాలు అందుకునే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం రెండూ మెరుగ్గా ఉంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు బిజీగా సాగుతాయి. అనుకోకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అత్యవసర పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావచ్చు. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూలతలు కనిపిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. పిల్లల నుంచి సంతోషకరమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం కలిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది కానీ, దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు రావచ్చు. కుటుంబ వాతావరణం చక్కబడుతుంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో బాధ్యతలు, పనిభారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల నుంచి అవసరమైన సహాయం లభిస్తుంది. దగ్గర బంధువుల రాకపోకలు ఉంటాయి. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. కొద్దిగా ఓర్పు, సహనంతో వ్యవహరించడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవం, మర్యాదలు లభిస్తాయి. వృత్తి జీవితం బిజీగా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతోనే ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులు ఆఫర్లు అందుకునే అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తితో వివాహ నిశ్చయం అయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలను ఒక పద్ధతి ప్రకారం చక్కబెడతారు. కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకువస్తాయి. ఇంట్లో శుభకార్యాలకు ప్రణాళికలు వేస్తారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి జీవితం అంచనాలకు మించి బిజీగా ఉంటుంది. పిల్లలు చదువులపై శ్రద్ధ పెడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన రావచ్చు. ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరం.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వ్యక్తిగత వ్యవహారాల్లో అశ్రద్ధ తగదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం అవసరం. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మితిమీరిన ఔదార్యాన్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో బాగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగి పోతుంది. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.