జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు జూన్ 19, 2026న గ్రహాల సంచారం చాలా చురుకుగా ఉందని పండితులు చెబుతున్నారు. సూర్యుడు, బుధుడు మిథునరాశిలో, కుజుడు, చంద్రుడు సింహరాశిలో, గురుడు కర్కాటకరాశిలో సంచరిస్తుండటంతో కొన్ని రాశుల వారికి వాక్చాతుర్యం, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరికొన్ని రాశుల వారికి ఆత్మవిశ్వాసం, భావోద్వేగాలు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ ప్రభావం ఈ రోజు నుంచి వచ్చే 45 రోజుల వరకు కొనసాగుతుందని చెబుతున్నారు.

మేషరాశి: ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు, ప్రణాళికలు అనుకూలంగా మారే అవకాశముంది. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు లభిస్తుంది.

వృషభరాశి: ఆర్థిక విషయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరమని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాల సూచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఈ సమయంలో దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మిథునరాశి: సూర్యుడు, బుధుడు, యురేనస్ సంచారం వలన ఈ రాశివారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పనిలో ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని పూర్తి చేస్తారు. చేతివృత్తుల వారికి ఒక్కసారిగా ఆర్డర్లు పెరగడంతో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది.

కర్కాటకరాశి: గురుడు ఉన్నత స్థితిలో సంచరించడం వలన కుటుంబం, ఆస్తి విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అనేక మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో లాభాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.

సింహరాశి: కుజుడు, చంద్రుడు ఈ రాశిలో సంచరించడం వలన ఉత్సాహం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వృత్తి పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఉన్నత స్థాయి కుటుంబంతో వివాహ సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. ఇంటి, బయట సుఖసంతోషాలు నెలకొంటాయి.

కన్యారాశి: కుటుంబ సమస్యలు తగ్గుతాయి. వివిధ రంగాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. వేతనవృద్ధి అవకాశాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

తులారాశి: గ్రహాల సంచారం వలన జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడటంతో గత బాకీల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు పదోన్నతులు రావచ్చు. వృత్తి పరంగా పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు. కొత్త పెట్టుబడులు పెడితే మూడు రెట్లు లాభాలు రావచ్చని పండితులు సూచిస్తున్నారు.

వృశ్చికరాశి: కొత్త అవకాశాలు లభించే రోజు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు లాభదాయక ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కృషికి తగిన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ధనుస్సురాశి: ఏ పని చేసినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి అవార్డులు, ప్రశంసలు లభించే అవకాశం ఉంది. చాలాకాలంగా పూర్తి కాలేకపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెడితే ఆశించిన లాభాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకరరాశి: గ్రహాల సంచారం వలన కార్యాలయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు తమ పనిపైనే దృష్టి పెట్టాలి. అవసరం లేని వాదనలు, వివాదాలు దూరంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు ఆలస్యమవడం, రావలసిన డబ్బులు ఆలస్యంగా రావడం, ఖర్చులు పెరగడం వలన ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

కుంభరాశి: ఈ రాశిలో ఫ్లూటో సంచరించడం వలన సామాజిక గుర్తింపు పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు, అక్కడ స్థిరపడే ప్రయత్నాలు విజయవంతం అయ్యే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై భూ లాభం కలుగుతుంది.

మీనరాశి: ఈ రాశివారికి చేపట్టిన పనులు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నం అనుకున్న విధంగా ఫలించే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా బలపడే అవకాశముందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పనిలో ఆటంకాలు వచ్చినా ధైర్యంగా పూర్తి చేస్తారు. చేతివృత్తుల వారికి ఒక్కసారిగా ఆర్డర్లు పెరగడంతో పని ఒత్తిడి పెరుగుతుంది.

స్పష్టీకరణ: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు, ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే వివరాల ఆధారంగా సిద్ధం చేయబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకర