రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
చైనా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు (PV Sindhu) పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో చెన్ యుఫీయ్ (చైనా) చేతిలో 16-21, 22-20, 21-18 తేడాతో ఆమె ఓడిపోయింది. ఇటీవలే జపాన్ ఓపెన్‌ను సింధు గెలుచుకున్న సంగతి తెలిసిందే. సెమీస్‌లో యుఫీయ్‌పైనే భారత షట్లర్ గెలిచి ఫైనల్‌కు వెళ్లింది. ఇప్పుడు కూడా చివరి వరకూ సింధు పోరాడినా ఓటమి తప్పలేదు.
తొలి గేమ్ సాధించినా..
దాదాపు గంటన్నరపాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్ పీవీ సింధుదే. 21-16 తేడాతో విజయం సాధించింది. ఇక రెండో గేమ్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించింది. కానీ, ఆఖర్లో పుంజుకున్న యుఫీయ్ 22-20 తేడాతో సింధుపై గెలిచి స్కోరును సమం (1-1) చేసింది. ఇక నిర్ణయాత్మక చివరి గేమ్‌లోనూ తీవ్ర పోటీ తప్పలేదు. పాయింట్ల కోసం ఇరువురూ శ్రమించారు. చివరికి 21-18 తేడాతో సింధుపై గెలిచిన యుఫీయ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.







