భార్య ఫోన్‌కు స్పందించేందుకు ప్రసంగం ఆపిన సునీల్‌ గవాస్కర్‌

ముంబయి: క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ఒక కార్యక్రమంలో చూపిన వినయంతో పాటు భార్యపై చూపిన గౌరవం నెటిజన్లను ఆకట్టుకుంది. సభ మధ్యలో భార్య నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌కు స్పందించేందుకు ఆయన తన ప్రసంగాన్ని కాసేపు నిలిపివేయడం, ఆ సందర్భాన్ని హాస్యభరితంగా మలచడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వీడియోలు విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి. ముంబయిలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సునీల్‌ గావస్కర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ గిఫ్ట్ అఫ్ లైఫ్ ’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 850 మంది చిన్నారులకు ఉచితంగా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు జరిపిన విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమంపై గావస్కర్‌ ప్రశంసలు కురిపిస్తూ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.

ఈ సమయంలో గావస్కర్‌ మొబైల్‌ ఫోన్‌ మోగింది. కాల్‌ చేసినది ఆయన భార్య మార్షనీల్ . సాధారణంగా సభల్లో మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌ వస్తే చాలామంది దాన్ని పక్కన పెట్టేస్తారు. అయితే గావస్కర్‌ మాత్రం సభ మధ్యలోనే తన ప్రసంగాన్ని ఆపి, ముందుగా సభికులకు క్షమాపణలు తెలుపుతూ ఫోన్‌ స్వీకరించారు.

అని గవస్కర్‌ చెప్పగానే సభలో నవ్వుల వర్షం కురిసింది. అక్కడున్నవారు చప్పట్లతో స్పందించారు. భార్యతో కాసేపు మాట్లాడిన అనంతరం ఆయన మళ్లీ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ వీడియోపై చర్చ కొనసాగుతూనే ఉంది.