కదిరిలో ఘనంగా జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా NYPSN వ్యవస్థాపక చైర్మన్ మరియు సిమ్స్ హాస్పిటల్ ఎండి నిసార్ యాసిన్ ఖాన్ సౌజన్యంతో ఈ టోర్నమెంట్‌కు ఏర్పాట్లు చేశారు.

జిల్లాలోని వివిధ మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయుల జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్‌లో తలుపుల జట్టుపై కదిరి జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాంబాబుకు లభించింది.

రెండో మ్యాచ్‌లో అమడగూరు జట్టుపై నల్లమాడ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా సంతోష్‌ను ఎంపిక చేశారు. మూడో మ్యాచ్‌లో ఎన్ పి కుంట జట్టు–2పై ముదిగుబ్బ జట్టు గెలుపొందగా, ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రవి నాయక్‌కు దక్కింది.

నాలుగో మ్యాచ్‌లో నల్లచెరువు జట్టుపై గాండ్లపెంట జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా హబీబుల్లాను ప్రకటించారు.

టోర్నమెంట్‌లో విజేతలకు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన ఆటగాళ్లకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో prtu నాయకుడు శ్రీధర్ రెడ్డి, హెడ్మాస్టర్ భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్, UTF నాయకుడు మైనుద్దీన్, రిటైర్డ్ హెడ్మాస్టర్ ఖాదర్ వలీ పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

ఈ కార్యక్రమం నిర్వహణలో రుద్రం రెడ్డి, శ్రీనివాసులు, అశ్వర్థ, శంకర్, సురేష్, ఆజం, మహేందర్ రెడ్డి, రబ్బాని తదితరులు కీలక పాత్ర పోషించారు. అలాగే వివిధ సంఘాల యూనియన్ నాయకులు గంగాధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, హరి ప్రసాద్‌తో పాటు అనేక మంది టీచర్లు టోర్నమెంట్‌కు హాజరై మ్యాచ్‌లను వీక్షించారు.

కదిరి టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో క్రీడాస్ఫూర్తి, పరస్పర సౌహార్దం పెంపొందించడమే లక్ష్యంగా నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.