రాయలసీమ న్యూస్, తమిళనాడు డెస్క్: కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురగన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపించినట్లు సమాచారం. కేంద్ర మంత్రిత్వ బాధ్యతలతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఎల్. మురగన్ ప్రకటించారు.
తమిళనాడులో భారతీయ జనతా పార్టీ (BJP)ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్. మురగన్ వెల్లడించారు. 2029లో జరగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం కావడానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఇప్పటివరకు నిర్వహించిన బాధ్యతలను ముగించి, ఇకపై పార్టీ బలపరిచే కార్యక్రమాలపై దృష్టి సారించనున్నట్లు ఎల్. మురగన్ స్పష్టం చేశారు. తమిళ్ నాడు లో BJP పట్టు పెంచేందుకు, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, కేడర్‌ను మరింత చురుకుగా మార్చడం వంటి అంశాలపై పనిచేయాలని ఆయన సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తమిళ్ నాడు కు సేవ చేసే అవకాశం దక్కడం తనకు అదృష్టంగా భావిస్తున్నట్లు ఎల్. మురగన్ తెలిపారు. మోదీ నాయకత్వం దేశ రాజకీయాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త దిశ చూపిందని, ఆ దిశలో తమిళ్ నాడు లో పార్టీని మరింత విస్తరించేందుకు తాను కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎల్. మురగన్ రాజీనామా నిర్ణయంపై BJP కేంద్ర నాయకత్వం స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఆయనను పూర్తిస్థాయి రాజకీయ బాధ్యతల కోసం సిద్ధం చేయడమే ఈ నిర్ణయానికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమిళ్ నాడు లో BJP వ్యూహాత్మకంగా పునర్వ్యవస్థీకరణకు ఈ రాజీనామా సంకేతంగా భావిస్తున్నారు.






