రాయలసీమ న్యూస్, టెక్నాలజీ డెస్క్: భారతి ఎయిర్‌టెల్ తమ కస్టమర్ల కోసం కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రముఖ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ Duolingoతో ఎయిర్టెల్ జతకట్టి, వినియోగదారులకు 12 నెలల పాటు Duolingo ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.
ఎయిర్టెల్ కస్టమర్లు తమ మొబైల్‌లో ఉన్న ఎయిర్టెల్ అప్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఇందుకోసం యాప్‌లోని రివార్డ్స్ విభాగంలోకి వెళ్లి, అక్కడ చూపించే Duolingo ప్రీమియం ఆప్షన్‌ను ఎంపిక చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత కలిగిన కస్టమర్లకు 12 నెలల పాటు అదనపు చార్జీలు లేకుండా ప్రీమియం సేవలు లభిస్తాయి.
Duolingo యాప్ ద్వారా ప్రస్తుతం 40 భాషలను నేర్చుకునే అవకాశం ఉంది. ఇందులో వివిధ స్థాయిలకు అనుగుణంగా పాఠాలు, వ్యాయామాలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు తమకు నచ్చిన భాషను ఎంచుకుని, దశలవారీగా నేర్చుకోవచ్చు.
ఈ ప్లాట్‌ఫామ్‌లో గ్రామర్, రాయడం, వినడం, మాట్లాడటం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చిన్న చిన్న పాఠాల రూపంలో ఇచ్చే వ్యాయామాల ద్వారా భాషపై పట్టు సాధించేందుకు Duolingo సహాయపడుతుంది. రోజువారీగా కొద్ది సమయం కేటాయించడం ద్వారా కూడా కొత్త భాషను అలవాటు చేసుకునేలా ఈ యాప్ రూపకల్పన చేసినట్లు సంస్థలు పేర్కొంటున్నాయి.
ఎయిర్టెల్ –Duolingo భాగస్వామ్యంతో, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు, విదేశీ భాషలపై ఆసక్తి ఉన్నవారికి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. మొబైల్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా పాఠాలు వినే సౌకర్యం ఉండటంతో, ఈ ఆఫర్‌ను ఎక్కువ మంది వినియోగించుకునే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారతి ఎయిర్‌టెల్ తరచూ తమ కస్టమర్ల కోసం డిజిటల్ సేవలతో అనుసంధానమైన ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే Duolingoతో తాజా భాగస్వామ్యం చేపట్టినట్లు కంపెనీ వర్గాలు సూచిస్తున్నాయి. డిజిటల్ లెర్నింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో ఇలాంటి ఆఫర్లు వినియోగదారుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.






