హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన హోటల్ షాదాబ్ ( మదీనా సర్కిల్ బ్రాంచ్) సహా పలు కేఫేలు, స్నాక్‌ పాయింట్లపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెంటిల్ డ్రగ్స్ (TG SAFE) బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించిన రెండు కేఫేలను మూసివేయడంతో పాటు హోటల్ షాదాబ్ FSSAI లైసెన్స్‌ను సస్పెండ్‌ చేశారు.

మొత్తం తొమ్మిది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంలు, వీటిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ , పోలీసు సిబ్బంది ఉన్నారు, నగరంలోని 19 కేఫేలు, స్నాక్‌ పాయింట్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్‌ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడం, వంటగదుల్లో పరిశుభ్రతా లోపాలు, ఆహార పదార్థాల తగిన విధంగా నిల్వ చేయకపోవడం, గడువు తీరిన, పాడైపోయిన పదార్థాలను ఉంచడం, ఈగలు, బొద్దింకలు వంటి కీటకాల బెడద వంటి అనేక ఉల్లంఘనలు బయటపడ్డాయి. కొంతమంది ఆహార కార్మికులు తల కవర్లు లేకుండా పనిచేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు.

బాగ్ లింగంపల్లి లోని డ్రీమ్స్ కెఫెటేరియా , పంజాగుట్ట లోని ఆసియాటిక్ కేఫ్ చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్‌ లేదా రిజిస్ట్రేషన్‌ లేకుండా నడుస్తున్నట్లు తేలడంతో వెంటనే మూసివేశారు. మదీనా సర్కిల్ లోని హోటల్ షాదాబ్ లో పరిశుభ్రత, శానిటేషన్‌, మాంసం సహా ఇతర ఆహార పదార్థాల నిల్వపై పలు ఉల్లంఘనలు గుర్తించిన TG సేఫ్ , హోటల్‌ FSSAI లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసి, మేనేజ్‌మెంట్‌ను కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది.

తనిఖీల సందర్భంగా ధూళి, ఈగలకు బహిర్గతమైన పాడైపోయే ఆహార పదార్థాలను అధికారులు అక్కడికక్కడే పారవేశారు. కల్తీ అనుమానం ఉన్న టీ పొడి, జింజర్ - గార్లిక్ పేస్ట్ , బిస్క్యూయిస్ తదితర పదార్థాలను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం పంపించారు. కల్తీ అనుమానంతో మొత్తం 15 ఆహార నమూనాలను సేకరించారు.

TG SAFE 12 సంస్థలకు మెరుగుదల నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపింది. వీటిలో కేఫ్ పర్షియా , బహార్ బిర్యానీ కేఫ్ , కేఫ్ డెక్కన్ , హనీమూన్ కేఫ్ , Rio రెస్తౌరంత్ , ఫ్రెండ్స్ అండ్ కేఫ్ , డైమండ్ పాయింట్ హోటల్ , హోటల్ ఇమ్రోజ్ , బ్లూ సి టీ అండ్ స్నాక్స్ , నిమ్రాహ్ కేఫ్ అండ్ బేకారి , గుల్జార్ ఫుడ్స్ ఉన్నాయి. ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేశారో లేదో తెలుసుకోవడానికి వీటిని మళ్లీ తనిఖీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అదనంగా గోల్డెన్ కేఫ్ , ద్రేఅమ్స్ కెఫెటేరియా , మీరోసా కేఫ్ అండ్ కిచెన్ , ఆసియాటిక్ కేఫ్ , హోటల్ షాదాబ్ కు show-cause నోటిక్స్ జారీ చేయనున్నట్లు TG SAFE వెల్లడించింది. వీటిపై జరిమానాలు సహా తదుపరి చర్యలు పరిశీలనలో ఉన్నాయని అధికారులు తెలిపారు.