Bigg Boss Telugu 10: కసి పెరిగింది.. కథ మారింది.. ‘

అగ్నిపరీక్ష సీజన్ 2’కు సర్వం సిద్ధం

బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన ‘Bigg Boss Telugu’ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ క్రేజీ షో, ఇప్పుడు గ్రాండ్‌గా సీజన్ 10తో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రసారం ప్రారంభమయ్యే అవకాశముండటంతో, అభిమానుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి పెరిగింది.

గత సీజన్ 9 తరహాలోనే ఈసారి కూడా సామాన్యులకు Bigg Boss హౌస్‌లో పెద్ద పీట వేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ పేరుతో డిజిటల్ ఆడిషన్స్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆడిషన్స్‌కు సంబంధించిన తాజా ప్రోమోను కూడా విడుదల చేశారు.

“ఈ సారి కసి పెరిగింది... కథ మారింది... గెట్ రెడీ ఫర్ బిగ్ బిఫోరో బిగ్గెస్ట్”

అని King Nagarjuna ప్రోమోలో చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మాటలతో షోపై అంచనాలు మరింత పెరిగాయి. ‘అగ్నిపరీక్ష సీజన్ 2’కు ఈసారి వస్తున్న స్పందన భారీ స్థాయిలో ఉందని, అందువల్ల పోటీ కూడా గత సీజన్ కంటే మరింత కఠినంగా ఉండబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గత సీజన్ 9లో సామాన్యుడిగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపిన కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా సామాన్యులకు అవకాశం ఇవ్వడంతో పాటు పాపులర్ సెలబ్రిటీలను కూడా హౌస్‌లోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్ ఉంది.

సోషల్ మీడియా లీక్స్ ప్రకారం, ఈ సీజన్ 10 కోసం నిఖిల్ విజయేంద్ర సింహ,తేజస్వి గౌడ ,పల్లవి రామిశెట్టి, పల్లవి గౌడ, హరి,వర్ష ,దీపికా తో పాటు ‘ కుక్ విత్ జాతి రత్నాలు’ షోకు చెందిన పలువురు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పేర్లపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

ఇక ప్రస్తుతం ‘ బిగ్ బాస్ తెలుగు సీజన్లో 10’ హోస్ట్ కింగ్ నాగార్జున పారితోషికం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీజన్ కోసం ఆయనకు సుమారు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. గత సీజన్ 9కు నాగార్జున దాదాపు రూ.35 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఈసారి షోకు ఉన్న ప్రత్యేకత, క్రేజ్ దృష్ట్యా మరో రూ.5 కోట్లు అదనంగా ఆఫర్ చేసినట్లు పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఎప్పటిలాగే ఫ్యాన్స్ వార్స్, ఆర్మీలు, పెయిడ్ బ్యాచ్‌ల హంగామాతో సోషల్ మీడియా హీట్ పెంచేందుకు ‘ బిగ్ బాస్ తెలుగు సీజన్లో 10’ సిద్ధమవుతోంది. కొత్త కంటెస్టెంట్లు, కొత్త టాస్కులు, కొత్త ట్విస్టులతో ఈసారి కథ ఎలా మలుపులు తిరుగుతుందో, ఎలాంటి కాంట్రవర్సీలు రేగుతాయో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.