రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
కాంగ్రెస్ పార్టీ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాహన మిత్ర కింద నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా చైర్మన్ దాసరి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య, కడప నగర చైర్మన్ షామీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. సోమవారం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మేనిఫెస్టో 2024 ప్రకారం డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని. డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు రూ.4 లక్షల వరకు పొందే రుణాలపై 5% పైబడిన వడ్డీ సబ్సిడీ ఇవ్వాలని. బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్ కు ఏటా రూ.15000 ఆర్థిక సహాయం చేయాలని. జీవో 21 రద్దు చేసి ఫైన్ ల భారం తగ్గించాలని. వాహనాలపై పెంచిన గ్రీన్ టాక్స్ తగ్గించాలని. ప్యాసింజర్ వ్యాన్లకు గ్రీన్ టాక్స్ , భారీగా పెంచిన రోడ్ టాక్స్ తగ్గించాలని.ఆటోలు, మోటార్ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సులు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దుచేసి, ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించాలని, లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో జాబీర్ అలీ పాల్గొన్నారు.













