అన్ని రంగాల్లో వైఎస్సార్ కడపను అగ్రస్థానంలో నిలపాలి : జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత

వైఎస్సార్ కడప: రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి సాధనతో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి ఎస్. సవిత పిలుపునిచ్చారు.

బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖామంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో ఈ సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ అధికారులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారసులుగా వ్యవహరించి, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఆమె సూచించారు. పారదర్శకత, అవినీతి రహిత పాలన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ప్రక్షాళన చేపడుతున్నారని, ప్రజలకు జవాబుదారీతనంతో సుపరిపాలన అందిస్తూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారని వివరించారు.

సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పని చేస్తోందని, జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. రెండుేళ్ల సుపరిపాలనలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన ప్రధాన లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని అనుసరించి స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధన దిశగా వైఎస్సార్ కడప జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా స్థాయిలో సక్రమంగా, విజయవంతంగా అమలు చేయడం అధికారుల బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ నుంచి అన్ని స్థాయిల అధికారులతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వం భాగస్వాములుగా జిల్లా అభివృద్ధిలో చురుకుగా పాల్గొని, అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేలా కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ కార్యక్రమాలను అవినీతి రహితంగా అమలు చేయాలని ఆమె కోరారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా స్వీకరించి, తమ వివరాలను నమోదు చేయాలని మంత్రి సూచించారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో భాగంగా జిల్లాలో అమలు చేస్తున్న 10 సూత్రాల పురోగతి, ప్రాధాన్యతా రంగాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి సవితకు క్షుణ్ణంగా వివరించారు.

2025–26 ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లా స్థూల జిల్లా ఉత్పత్తి విలువ 79,627 కోట్ల రూపాయలు కాగా రాష్ట్రంలో 8వ స్థానంలో ఉందని, జిల్లా స్థూల విలువ జోడింపు 73,405 కోట్ల రూపాయలు నమోదైందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో తలసరి ఆదాయం 2,83,734 రూపాయలు ఉండగా రాష్ట్రంలో 12వ స్థానంలో ఉన్నట్లు వివరించారు.

జిల్లా ఆర్థిక వ్యవస్థలో సేవారంగం 38.43 శాతం (28,212 కోట్లు), పరిశ్రమల రంగం 32.46 శాతం (23,830 కోట్లు), వ్యవసాయ, అనుబంధ రంగాలు 29 శాతం (21,363 కోట్లు) వాటా కలిగి ఉన్నాయని, మూడు రంగాలు సమతుల్యంగా అభివృద్ధి చెందుతున్నాయని కలెక్టర్ తెలిపారు. స్వర్ణాంధ్ర–2047 విజన్ కింద ప్రస్తుతం సుమారు 79 వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉన్న జిల్లా ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 13.26 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా, తలసరి ఆదాయాన్ని 2.83 లక్షల రూపాయల నుంచి 34 లక్షల రూపాయల వరకు పెంచే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

2026–27 సంవత్సరానికి జిల్లా మొత్తం స్థూల విలువ జోడింపు లక్ష్యం 84,482 కోట్లు, స్థూల జిల్లా ఉత్పత్తి లక్ష్యం 91,606 కోట్లు గా నిర్ణయించామని, ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాల ద్వారా 23,908 కోట్లు, పరిశ్రమల ద్వారా 27,821 కోట్లు, సేవారంగం ద్వారా 32,753 కోట్లు సాధించేందుకు కార్యాచరణ కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.

మహిళా సాధికారత కోసం 29,224 స్వయం సహాయక సంఘాలు, 2.86 లక్షల మహిళా సభ్యులతో 2,355.90 కోట్ల రూపాయల జీవనోపాధి ప్రణాళిక, 1,323.29 కోట్ల రూపాయల రుణ ప్రణాళిక అమలవుతున్నట్లు వివరించారు. మత్స్యరంగంలో 300.25 లక్షల రూపాయల సబ్సిడీ, 511 లైసెన్సులు, 538 పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని, పట్టణాభివృద్ధిలో 52.78 కోట్ల రూపాయలతో 520 టన్నుల సామర్థ్య మౌలిక వసతుల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు.

జిల్లా ఆర్థిక వృద్ధిలో ఉద్యానవనం, గనులు, తయారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం, రవాణా, రియల్ ఎస్టేట్, సేవారంగం కీలక పాత్ర పోషిస్తున్నాయని, ముఖ్యంగా JSW ఉక్కు పరిశ్రమ, Startup Kadapa, పారిశ్రామిక పార్కులు, ఉద్యాన పంటల ఎగుమతులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్‌లో జిల్లా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.

పోషకాహారం, వ్యవసాయం, జల సంరక్షణ, పరిశ్రమలు, పెట్టుబడులు, స్టార్టప్‌లు, మహిళా సాధికారత, ఉపాధి, మత్స్యరంగం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి 10 సూత్రాల అమలులో జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని ఆయన తెలిపారు. జిల్లాను Investment Destination Center గా మార్చేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా కడప కలెక్టరేట్‌లో Invest Kadapa Center ఏర్పాటు చేసి, పెట్టుబడులకు ముందుకొచ్చే ఇన్వెస్టర్లకు ప్రణాళిక నుంచి ఆదాయం దశ వరకు జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షణలో సలహాలు, మార్గదర్శకాలు అందించనున్నట్లు వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాహార మధ్యాహ్న భోజనం అందించేందుకు అమలు చేస్తున్న Smart Kitchen వ్యవస్థ గురించి కూడా కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం 5