బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#శ్రీధర్

35 articles

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించిన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ
జిల్లా వార్తలు

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించిన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ

ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన అధికారులు ఆయనకు స్వాగతం పలికి ఆలయ చరిత్ర, నిర్వహణపై వివరాలు తెలియజేసి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదం అందజేశారు. దర్శనం సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లు కనిపించాయి.

25, ఆగ 2026

కలెక్టర్‌ బంగ్లాలో ఎట్‌ హోమ్‌ వేడుకలు
జిల్లా వార్తలు

కలెక్టర్‌ బంగ్లాలో ఎట్‌ హోమ్‌ వేడుకలు

వైఎస్ఆర్‌ జిల్లా కలెక్టర్‌ బంగ్లాలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎట్‌ హోమ్‌ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఆధ్వర్యంలో జరిగిన తేనీటి విందులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, శాంతిభద్రతలపై సౌహార్ద వాతావరణంలో చర్చించారు.

16, ఆగ 2026

కడపలో ఘనంగా12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
జిల్లా వార్తలు

కడపలో ఘనంగా12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

కడప కలెక్టరేట్‌లో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేనేత కార్మికులకు స్వర్ణయుగం రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేతన్న నేస్తం పథకం ద్వారా జిల్లాలో 8,713 మంది అర్హులైన చేనేత కార్మికులకు మొత్తం రూ.21.78 కోట్లు, ప్రతి మగ్గం ఉన్న కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందనున్నట్లు తెలిపారు.

8, ఆగ 2026

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు
జిల్లా వార్తలు

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు

ఒంటిమిట్ట ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు, టిడిపి సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్యతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని శాలువా కప్పి సన్మానించి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ వైద్యుల సమస్యలు, సంక్షేమం, గ్రామీణ ఆరోగ్య సేవల్లో వారి పాత్రపై సానుకూలంగా చర్చించినట్టు ప్రతినిధులు తెలిపారు.

7, ఆగ 2026

ఎల్ నినో పరిస్థితులపై కడపలో సమీక్షా సమావేశం
జిల్లా వార్తలు

ఎల్ నినో పరిస్థితులపై కడపలో సమీక్షా సమావేశం

కడప జిల్లా కలెక్టరేట్‌లో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో వర్షపాతం, భూగర్భ జలాలు, జలాశయాల నీటి నిల్వలు, ఖరీఫ్ సాగు, ఇప్పటికే అమలులో ఉన్న ప్రత్యామ్నాయ చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ల ద్వారా సమగ్రంగా సమీక్షించారు. ఎల్ నినో ప్రభావం తక్కువగా ఉండేలా ముందస్తు ప్రణాళికలు, నీటి నిర్వహణ, రైతులకు అవగాహన, విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.

6, ఆగ 2026

కడపలో స్మార్ట్ కిచెన్–ప్రాజెక్ట్ కు ప్రశంస
జిల్లా వార్తలు

కడపలో స్మార్ట్ కిచెన్–ప్రాజెక్ట్ కు ప్రశంస

కడప జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్, "ప్రాజెక్ట్ ఏఎన్‌టీఎస్" కార్యక్రమాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, సమైక్యతా భావన, నాయకత్వ లక్షణాల పెంపుకు దోహదపడుతున్న వినూత్న విద్యా విధానాలుగా JICA నిపుణులు వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందించారు. మధ్యాహ్న భోజనాన్ని విలువల అభ్యాస అవకాశంగా మలుస్తున్న ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే అవకాశముందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

6, ఆగ 2026

వైఎస్సార్ కడపలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కలెక్టర్ దిశానిర్దేశం
జిల్లా వార్తలు

వైఎస్సార్ కడపలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కలెక్టర్ దిశానిర్దేశం

వైఎస్సార్ కడపలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశభక్తి స్ఫూర్తి ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ ఆదేశించారు. ఆగస్టు 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకల కోసం పరేడ్, వేదిక, భద్రత, ట్రాఫిక్, మౌలిక వసతులు, పారిశుధ్యం, వైద్య శిబిరాలు, ప్రదర్శన శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలపై స్పష్టమైన బాధ్యతలు కేటాయించారు. విధుల్లో మెరుగ్గా పనిచేసిన అధికారులకు వేడుకల రోజున ప్రశంసా పత్రాలు అందజేస్తామని ప్రకటించారు.

6, ఆగ 2026

వైఎస్సార్ కడప జిల్లాలో ఎస్‌ఐఆర్–2026 ముసాయిదా ఓటరు జాబితా విడుదల
జిల్లా వార్తలు

వైఎస్సార్ కడప జిల్లాలో ఎస్‌ఐఆర్–2026 ముసాయిదా ఓటరు జాబితా విడుదల

వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించిన ఎస్‌ఐఆర్–2026 ముసాయిదా ఫోటో ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి విడుదల చేసి ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. జిల్లాలో 16,51,312 మంది సాధారణ ఓటర్లు, 2,217 మంది సర్వీస్ ఓటర్లు నమోదయ్యారు. ముసాయిదా జాబితాలో తమ వివరాలు తప్పనిసరిగా పరిశీలించి, లోపాలు ఉంటే గడువులోగా దరఖాస్తుల ద్వారా సరిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

5, ఆగ 2026

జిల్లాల్లో ఐటీ మౌలిక వసతుల విస్తరణకు ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభం
జిల్లా వార్తలు

జిల్లాల్లో ఐటీ మౌలిక వసతుల విస్తరణకు ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల్లో ఐటీ మౌలిక వసతుల విస్తరణకు https://itinfra.ap.gov.in పోర్టల్‌ను ప్రారంభించింది అని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లాలోని భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ అంతస్తులు, ఖాళీ భూముల వివరాలను ఉచితంగా నమోదు చేసి పెట్టుబడిదారులకు చేరవేయడం ద్వారా ఐటీ సంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమలను ఆకర్షించి ఉపాధి అవకాశాలు, అదనపు ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఆయన సూచించారు.

2, ఆగ 2026

త్వరలో ప్రారంభానికి సిద్ధమైన "స్టార్టప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్
జిల్లా వార్తలు

త్వరలో ప్రారంభానికి సిద్ధమైన "స్టార్టప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్

కడపలో త్వరలో ప్రారంభమయ్యే "స్టార్టప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ ద్వారా జిల్లా యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. భవనం నిర్మాణం దాదాపు పూర్తికావడంతో, నాణ్యతకు రాజీ లేకుండా మిగతా పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ కేంద్రం ద్వారా స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు అవసరమైన మార్గదర్శకత్వం, సదుపాయాలు ఒకే వేదికపై లభించనున్నాయి.

31, జులై 2026

మైదుకూరు నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన
జిల్లా వార్తలు

మైదుకూరు నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన

మైదుకూరు నియోజకవర్గంలోని తిప్పిరెడ్డిపల్లె–ముదిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం పనులకు రూ.8.90 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్న ఈ కార్యక్రమంతో రెండు గ్రామాల చెరువులు నీటితో నిండిపోయి వేలాది ఎకరాలకు శాశ్వత సాగునీటి వసతి కలుగుతుందని, రైతు సంక్షేమం, నీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు.

30, జులై 2026

కడప జిల్లాలో అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశాలు
జిల్లా వార్తలు

కడప జిల్లాలో అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశాలు

కడప జిల్లాలో అమృత్ 2.0 పథకం కింద తాగునీటి, మురుగునీటి శుద్ధి, జలవనరుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి గడువుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప, బద్వేల్, మైదుకూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు పట్టణాల్లో పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే మొదలుపెట్టి పట్టణాల్లో శాశ్వత పరిష్కారాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.

30, జులై 2026

జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్లతో కొత్త శకం
జిల్లా వార్తలు

జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్లతో కొత్త శకం

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో స్మార్ట్ కిచెన్ వ్యవస్థను దశలవారీగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 20 స్మార్ట్ కిచెన్లు పనిచేస్తుండగా, త్వరలో మరో 13 ప్రారంభం కానున్నాయి. పలు పాఠశాలల్లో ఆహార తయారీ, పరిశుభ్రత, నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

29, జులై 2026

యువత ఆవిష్కరణలకు వేదికగా రూపుదిద్దుకుంటున్న "స్టార్టప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్
జిల్లా వార్తలు

యువత ఆవిష్కరణలకు వేదికగా రూపుదిద్దుకుంటున్న "స్టార్టప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్

కడపలో నిర్మిస్తున్న "స్టార్టప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్‌ ద్వారా యువతలో ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి పెంపొందించి ఉద్యోగాలు సృష్టించే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. P-4 విధానంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలకు మెంటరింగ్, నెట్‌వర్కింగ్, సాంకేతిక పరిజ్ఞానం అందించే కేంద్రంగా ఇది రాష్ట్రానికి ఆదర్శంగా నిలవనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

28, జులై 2026

జిల్లాలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ దేశానికే ఆదర్శం: కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
జిల్లా వార్తలు

జిల్లాలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ దేశానికే ఆదర్శం: కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

జిల్లాలో Self Help Group మహిళల ఆధ్వర్యంలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవడం జిల్లా యంత్రాంగానికి గర్వకారణమని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. దశలవారీగా స్మార్ట్ కిచెన్ల విస్తరణ, ప్రతి విద్యార్థికి యూనిక్ భోజన ప్లేట్ సరఫరా ద్వారా మధ్యాహ్న భోజన పథకంలో పరిశుభ్రత, నాణ్యత, పారదర్శకత, పర్యవేక్షణ మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు.

28, జులై 2026

ప్రజాభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్
జిల్లా వార్తలు

ప్రజాభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పీజీఆర్ఎస్ ద్వారా పొందుతున్న సేవలపై ప్రజలు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాన్ని నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా, మండల పీజీఆర్ఎస్ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ల ద్వారా వచ్చిన స్పందనలు సేవల నాణ్యత మెరుగుదలకు ఉపయోగపడతాయని, ఫిర్యాదుల స్థితిగతులను టోల్ ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

27, జులై 2026

ఈవీఎంలు, VVPATs భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పరిశీలన
జిల్లా వార్తలు

ఈవీఎంలు, VVPATs భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పరిశీలన

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు కలెక్టరేట్ గోడౌన్లలో నిల్వలో ఉన్న ఈవీఎంలు, VVPATs భద్రతా ఏర్పాట్లు, నిర్వహణ పరిస్థితులను నెలవారీ తనిఖీల్లో భాగంగా సమీక్షించారు. గోడౌన్ల భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ, రిజిస్టర్ నిర్వహణ, సిబ్బంది బాధ్యతల పంపిణీ వంటి అంశాలను పరిశీలిస్తూ ఎన్నికల సామగ్రి భద్రత, పారదర్శకతకు ఎలాంటి రాజీ పడకుండా చర్యలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

26, జులై 2026

అది.. పుష్పక విమానం కాదు నాయనా..!
జిల్లా వార్తలు

అది.. పుష్పక విమానం కాదు నాయనా..!

ఒకరా ఇద్దరా.. పైగా అందులో చిన్నపిల్లలూ కారు.. ! ఒకే బైక్‌పై ఏకంగా ఆరుగురు యువకులు ప్రయాణించిన తీరు చూసి పోలీసులే నోరెళ్లబెట్టారు.

25, జులై 2026

అందెశ్రీ నాకు ఆత్మబంధువు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
తెలంగాణ

అందెశ్రీ నాకు ఆత్మబంధువు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘట్‌కేసర్‌లో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ జయంతి సందర్భంగా స్మృతి వన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, భూమి పూజ నిర్వహించారు. అందెశ్రీ తనకు ఆత్మబంధువుగా మారారని, తన రాజకీయ ప్రయాణానికి ఆయన గానం, స్ఫూర్తి పెద్ద ఆధారమని ముఖ్యమంత్రి భావోద్వేగంగా గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు, గొంతులు అర్పించిన తొమ్మిది కుటుంబాలకు ఒక్కొక్కటికి కోటి రూపాయలు అందజేసిన విషయాన్ని, “జయ జయహే తెలంగాణ” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన సందర్భాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

19, జులై 2026

వియత్నాం బోటు ప్రమాద మృతదేహాలు హైదరాబాద్‌ చేరుకున్నాయి
ఆంధ్రప్రదేశ్

వియత్నాం బోటు ప్రమాద మృతదేహాలు హైదరాబాద్‌ చేరుకున్నాయి

వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలు ప్రత్యేక విమానంలో ముంబయి ద్వారా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మచిలీపట్నం, కడప, హిందూపురం ప్రాంతాలకు మృతదేహాలను తరలించేందుకు ఏపీఎన్‌ఆర్‌టీసీ ప్రత్యేక అంబులెన్స్‌లు, జిల్లా అధికారులతో సమన్వయం వంటి ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసింది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు కొనసాగిస్తున్నాయి.

14, జులై 2026

కడప రిమ్స్ మెడికల్ విద్యార్థినుల అస్వస్థతపై మంత్రి సవిత ఆరా
జిల్లా వార్తలు

కడప రిమ్స్ మెడికల్ విద్యార్థినుల అస్వస్థతపై మంత్రి సవిత ఆరా

కడప రిమ్స్ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత వెంటనే స్పందించి, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మంత్రి సవితకు నివేదించగా, హాస్టల్‌లోని అన్ని విద్యార్థినులపై వైద్య పరీక్షలు నిర్వహించి, ఆహార నాణ్యతపై కఠిన పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు.

8, జులై 2026

ఆధునిక సాంకేతికతతో రైతులకు అధిక దిగుబడులు : జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్
జిల్లా వార్తలు

ఆధునిక సాంకేతికతతో రైతులకు అధిక దిగుబడులు : జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్

జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్ ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సమతుల్య పోషక నిర్వహణ, సేంద్రియ సాగు, నీటి పొదుపు విధానాలు అవలంబిస్తే రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధ్యమవుతుందని తెలిపారు. వీరపునాయునిపల్లె మండలం పాలగిరి గ్రామంలోని ఆర్‌ఎం కిసాన్ సెంటర్, కృషి విజ్ఞాన కేంద్రం–బారామతి భాగస్వామ్యంతో ఉచిత శిక్షణలు, వినూత్న వ్యవసాయ పద్ధతుల ద్వారా దేశ రైతాంగానికి ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరవేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

8, జులై 2026

జాతీయ రహదారిపై ఐచర్‌ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
జిల్లా వార్తలు

జాతీయ రహదారిపై ఐచర్‌ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా సోమందేపల్లి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారి వద్ద ఐచర్‌ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వెల్డింగ్‌ కార్మికుడు నరసింహమూర్తి అక్కడికక్కడే మృతి చెందగా, చాంద్‌బాషా తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐచర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

6, జులై 2026

సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు
జిల్లా వార్తలు

సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు

జూలై 3వ తేదీ శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వై ఎస్ ఆర్ కడప జిల్లాకు ఒకరోజు పర్యటనకు రానున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి JSW ARSL ప్లాంట్ సైట్‌లో హెలిప్యాడ్‌కు చేరుకుని, కన్య తీర్థం బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించి, JSW ARSL Heavy Section Mill కాంక్రీటు ఫ్లోరింగ్, JSW Rayalaseema Limited ప్రాజెక్టు, 400 మెగావాట్ల Solar Plant, Industrial Park శిలాఫలకాలను ఆవిష్కరించి, మధ్యాహ్నం 2.10 గంటలకు Kuppam‌కు బయలుదేరనున్నారు.

1, జులై 2026

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల మృతి
జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల మృతి

కర్ణాటకలోని కేజీఎఫ్‌ సమీపం పారాండ్లహళ్లికి చెందిన లేటు శ్రీధర్‌ పిల్లలు బాలాజీ, మహశ్రీలు అమ్మమ్మ ఇంటి నుంచి సొంతూరుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా నాయకనేరి ఘాట్‌ రోడ్డులో రెండు లారీల మధ్య ఇరుక్కుపోయిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమై ఉండొచ్చని వి.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, తండ్రి తర్వాత పిల్లలను కోల్పోవడంతో కుటుంబం, గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

29, జూన్ 2026

మోడల్ పాఠశాలల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్
జిల్లా వార్తలు

మోడల్ పాఠశాలల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్

జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ కింద ఎంపికైన 396 మోడల్ పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యత ప్రమాణాలతో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మండల విద్యాశాఖ, ఇంజినీరింగ్, పురపాలక, గ్రామీణ నీటి సరఫరా శాఖల సమన్వయంతో మౌలిక వసతుల కల్పన, మరమ్మతులను సకాలంలో పూర్తి చేసి, “మన బడి – మన భవిష్యత్తు” రెండో దశ నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు.

24, జూన్ 2026

ఫుడ్ ట్రక్కుల పరిశీలించిన కలెక్టర్
జిల్లా వార్తలు

ఫుడ్ ట్రక్కుల పరిశీలించిన కలెక్టర్

వైయస్సార్ కడప జిల్లాలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ద్వారా సిద్ధమయ్యే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలకు చేరవేసేందుకు రూపొందించిన ఫుడ్ ట్రక్కులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ట్రక్కుల నిర్మాణం, భద్రతా ప్రమాణాలు, శీతలీకరణ, ఉష్ణోగ్రత నియంత్రణ,మానిటరింగ్ సాంకేతికతపై ఆయన సమీక్షించి, వీటి ద్వారా భోజన సరఫరా సామర్థ్యం, నాణ్యత పర్యవేక్షణ మెరుగుపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

23, జూన్ 2026

సూరారంలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రతీకార హత్యలు!
తెలంగాణ

సూరారంలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రతీకార హత్యలు!

పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం ఓ యువకుడిని ఆటోతో ఢీకొట్టి నిన్న హత్య చేయగా.. అందుకు ప్రతీకారంగా మృతుడి బంధువులు అతని హత్యకు కారకుడైన వ్యక్తి తండ్రిని రాత్రి హత్య చేశారు.

23, జూన్ 2026

జూన్ 22 నుంచి 27 వరకు "రైతన్న మీకోసం"
జిల్లా వార్తలు

జూన్ 22 నుంచి 27 వరకు "రైతన్న మీకోసం"

వైఎస్సార్ కడప జిల్లాలో జూన్ 22 నుంచి 27 వరకు మండల, గ్రామ స్థాయిలో "రైతన్న మీకోసం" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. రైతుల అభ్యున్నతి, లాభసాటి వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, రైతుల సమస్యలను గ్రామ స్థాయిలోనే స్వీకరించి పరిష్కరించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

22, జూన్ 2026

ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభం
టెక్నాలజీ

ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభం

అమరావతిలోని మేధా టవర్స్‌లో ఆంధ్రప్రదేశ్ తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను ప్రారంభించి, APTS, Chandigarh University Business Incubation Center మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. క్వాంటం టెక్నాలజీ, పరిశోధన, స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణలో పరస్పర సహకారం ద్వారా రాష్ట్రాన్ని క్వాంటం, DeepTech, Artificial Intelligence వంటి ఆధునిక సాంకేతిక రంగాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

20, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters