రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: మైదుకూరు: మైదుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆగష్టు 5వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.పార్ధసారథి ఒక ప్రకటనలో తెలిపారు.
10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లకు అర్హులని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొద్ది కళాశాలలో మాత్రమే అందుబాటులో ఉన్న కెమికల్ ఇంజనీరింగ్ , మేతల్లూరుజికల్ ఇంజనీరింగ్ , కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ కోర్సులు మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో అందుబాటులో ఉండటం ప్రత్యేకమని ప్రిన్సిపాల్ వివరించారు.
ఏపీ పాలీసెట్ -2026లో అర్హత పొందిన OC, BC విద్యార్థులకు మొత్తం ప్రవేశ రుసుము రూ.5,400గా, అర్హత పొందని లేదా పాలీసెట్ రాయకపోయిన OC, BC విద్యార్థులకు రూ.5,800గా నిర్ణయించినట్లు తెలిపారు. పాలీసెట్ లో అర్హత పొందిన SC, ST విద్యార్థులకు ప్రవేశ రుసుము రూ.4,950, అర్హత పొందని లేదా పాలీసెట్ రాయకపోయిన SC, ST విద్యార్థులకు రూ.5,050గా ఉండనున్నట్లు ప్రిన్సిపాల్ వివరించారు.
స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా Original TC, 10వ తరగతి మార్కుల జాబితా, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్ , SC, ST, BC విద్యార్థులు caste సర్టిఫికెట్ , అలాగే పాలీసెట్ లో అర్హత పొందిన వారు హాల్ టికెట్ , రాంక్ కార్డు తీసుకురావాలని సూచించారు.
ఆగష్టు 5న కాలేజీలో జరగనున్న స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరిన్ని వివరాల కోసం 7075922670, 8985257287 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక కోర్సుల కారణంగా స్థానిక విద్యార్థులతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులు కూడా అడ్మిషన్లపై ఆసక్తి చూపుతున్నట్లు కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి.













