బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సంవత్సరానికి

26 articles

మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలు – దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా వార్తలు

మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలు – దరఖాస్తుల ఆహ్వానం

మాజీ సైనికుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరానికి ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎస్. మహేంద్రనాథ్ తెలిపారు. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31, 2026లోగా www.ksb.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేశారు.

6, ఆగ 2026

మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఆగష్టు 5న స్పాట్ అడ్మిషన్లు
జిల్లా వార్తలు

మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఆగష్టు 5న స్పాట్ అడ్మిషన్లు

మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ఈ నెల 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు కాగా, POLYCET అర్హత, వర్గాల వారీగా ప్రవేశ రుసుము రూ.4,950 నుంచి రూ.5,800 వరకు నిర్ణయించారు. అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, POLYCET హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ తీసుకురావాలని, మరిన్ని వివరాలకు ఇచ్చిన ఫోన్ నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.

3, ఆగ 2026

ఆదాయపు పన్ను రిటర్న్ గడువు జూలై 31తో ముగింపు
బిజినెస్

ఆదాయపు పన్ను రిటర్న్ గడువు జూలై 31తో ముగింపు

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు జూలై 31తో ముగియనుండగా, గడువు పొడిగించే అవకాశం లేదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే ఆదాయానికి అనుగుణంగా రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా, బకాయి పన్నుపై నెలకు 1 శాతం వడ్డీ, రీఫండ్ ఆలస్యం, అలాగే ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు జైలు శిక్ష వంటి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

30, జులై 2026

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో మేనేజర్ నియామకాలు: 395 ఖాళీలు, ఆన్‌లైన్ దరఖాస్తులు
ఉద్యోగాలు

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో మేనేజర్ నియామకాలు: 395 ఖాళీలు, ఆన్‌లైన్ దరఖాస్తులు

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా 2026 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 395 మేనేజర్ ఖాళీలను ప్రకటించి, అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనుంది. వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టులకు సంబంధిత డిగ్రీ, కొన్నింటికి అనుభవం అవసరమై, రిటన్ ఎక్సమినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. పూర్తి వివరాలు, ఫీజు, పరీక్ష విధానం నోటిఫికేషన్‌లో ఇవ్వబడినందున అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయాలని సూచిస్తున్నారు.

27, జులై 2026

SAIL రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ పోస్టులు
ఉద్యోగాలు

SAIL రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ పోస్టులు

SAIL పరిధిలోనిరూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 2026–27 సంవత్సరానికి 1,110 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి 18–28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అప్పరెంటిసుషిప్ ఇండియా లేదా NATS పోర్టల్ ద్వారా 2026 ఆగస్టు 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా మెరిట్, వాక్–ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి, నెలకు రూ.9,600–12,300 స్టైపెండ్ అందించనున్నారు.

20, జులై 2026

జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటన.. !  ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’కు జాతీయ పురస్కారం
సినిమా

జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటన.. ! ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’కు జాతీయ పురస్కారం

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2024 సంవత్సరానికి గానూ మొత్తం 400లకు పైగా చిత్రాలు జ్యూరీ ముందుకు రాగా, వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటిని ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది.

18, జులై 2026

ఏపీ EAPCET 2026: ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులు, కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
విద్య

ఏపీ EAPCET 2026: ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులు, కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఏపీ EAPCET 2026 ఇంజినీరింగ్ ప్రవేశాల మొదటి విడత కౌన్సెలింగ్ జూలై 20 నుంచి ఆగస్టు 6 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ధ్రువపత్రాల పరిశీలన 22–31, వెబ్ ఆప్షన్స్ 25–31, సీట్ల కేటాయింపు ఆగస్టు 6న ఉండగా, 7–13 మధ్య కాలేజీల్లో రిపోర్టు చేయాలి. కనీస ఫీజు రూ.47 వేలుగా తాత్కాలికంగా నిర్ణయించగా, తుది ఫీజు నిర్మాణం Fee Regulatory Committee నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అమల్లోకి రానుంది.

16, జులై 2026

దాతలకు తిరుమలలో కొత్త రూల్స్‌.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
రాజకీయాలు

దాతలకు తిరుమలలో కొత్త రూల్స్‌.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

తిరుమలలో సామాన్య భక్తుల దర్శనాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాతలకు కల్పించే సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ కొత్త డోనర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర వెల్లడించారు.

14, జులై 2026

అక్టోబర్‌లో పీఎం కిసాన్ 24వ విడత నిధులు
జాతీయం

అక్టోబర్‌లో పీఎం కిసాన్ 24వ విడత నిధులు

అక్టోబర్‌లో పీఎం కిసాన్ పథకం 24వ విడత నిధులు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. గత 23వ విడతలో సాంకేతిక లోపాల వల్ల డబ్బులు అందని రైతులు పీఎం కిసాన్ పోర్టల్, గ్రామ వాలంటీర్లు, బ్యాంకుల ద్వారా తమ ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఈకేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ సరిచేసుకుంటే కొత్త విడత నిధులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందే అవకాశం ఉంటుంది.

13, జులై 2026

రష్యాకు మరో దెబ్బ.. సిజ్రాన్‌ చమురు రిఫైనరీపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి
అంతర్జాతీయం

రష్యాకు మరో దెబ్బ.. సిజ్రాన్‌ చమురు రిఫైనరీపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి

రష్యాలోని సమర రీజియన్‌లో ఉన్న సిజ్రాన్‌ చమురు రిఫైనరీపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో భారీ నష్టం జరిగి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచాయి. అజోవ్‌ సముద్రంలో చమురు రవాణా చేస్తున్న ట్యాంకర్లు, ఫెర్రీలు, లూబ్రికెంట్‌ ఆయిల్‌ రైలు వంటి ఇంధన వసతులపై వరుస దాడుల వల్ల రష్యా చమురు శుద్ధి సామర్థ్యం 20–40% వరకు తగ్గి, ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

12, జులై 2026

ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌ఎంసీ తీపికబురు: అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌ఎంసీ తీపికబురు: అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు

జాతీయ వైద్య కమిషన్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌కు 2026-27 విద్యా సంవత్సరానికి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75 సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 25 సీట్లు పెంచడంతో అక్కడి సీట్ల సంఖ్య వరుసగా 250, 200కు చేరగా, వైద్య విద్యలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

11, జులై 2026

జవహర్‌ నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా వార్తలు

జవహర్‌ నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం బనవాసిలో 2027-28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం ప్రకటించారు. జిల్లాకు చెందిన, గుర్తింపు పొందిన పాఠశాలలో 2026-27లో ఐదో తరగతి చదువుతున్న, జన్మతేదీ 1-5-2015 నుంచి 31-7-2017 మధ్యలో ఉన్న విద్యార్థులు 31-7-2026లోపు navodaya.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షను 28-11-2026న నిర్వహించి మెరిట్ ఆధారంగా 80 సీట్లను కేటాయించనున్నారు.

8, జులై 2026

దేశమంతా నైరుతి విస్తరణ దశలో వర్షాల ప్రభావం తీవ్రం
వాతావరణం

దేశమంతా నైరుతి విస్తరణ దశలో వర్షాల ప్రభావం తీవ్రం

నైరుతి మాన్సూన్ విస్తరణ దశలోకి ప్రవేశించగా, మధ్యప్రదేశ్‌పై ఉన్న అల్పపీడనం ప్రభావంతో మధ్యభారతం నుంచి దక్షిణ దిశగా వర్షాలు విస్తరిస్తున్నాయి. తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు విస్తృతంగా, కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

7, జులై 2026

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
విద్య

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంబీఏ (హెచ్‌హెచ్‌సీఎం) కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి, 01.06.2006 లేదా అంతకంటే ముందు జన్మించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ప్రవేశ పరీక్ష లేదా ICET ర్యాంకు ఆధారంగా ఎంపిక చేసి, ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీని 05.08.2026గా నిర్ణయించారు.

29, జూన్ 2026

ఏపీ Group-2లో మొత్తం 750 ఖాళీలు
ఉద్యోగాలు

ఏపీ Group-2లో మొత్తం 750 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌లో Group-2 సేవల్లో 2026 నియామక ప్రకటన ద్వారా మొత్తం 750 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారిక సమాచారం వెల్లడైంది. Assistant Registrar (Cooperative), Assistant Section Officer, Municipal Commissioner, Excise Sub-Inspector, Sub Registrar, Accountant, Auditor, Deputy MPDO, Deputy Tahsildar వంటి వివిధ హోదాలకు 493 కార్యనిర్వాహక, 257 అకార్యనిర్వాహక పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరాల్లో స్పష్టం చేశారు.

28, జూన్ 2026

రిటైర్మెంట్ వయసు పెంపు!:  ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా..
రాజకీయాలు

రిటైర్మెంట్ వయసు పెంపు!: ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా..

ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

23, జూన్ 2026

నెల్లూరు జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ నిధుల విడుదలకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ నిధుల విడుదలకు సిద్ధం

నెల్లూరు జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ పథకాల తొలి సంయుక్త విడతగా మొత్తం రూ.117.16 కోట్లను ఈరోజు మధ్యాహ్నం నుంచి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ చేయనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. జిల్లాలో 1,77,545 మంది ‘అన్నదాత సుఖీభవ’, 1,41,921 మంది ‘పీఎం కిసాన్’ లబ్ధిదారులు ఉండగా, ప్రతి కుటుంబానికి వరుసగా రూ.5,000, రూ.2,000 చొప్పున అందించనున్నారు.

20, జూన్ 2026

అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌ : రేపు రైతుల ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
వ్యవసాయం

అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌ : రేపు రైతుల ఖాతాల్లోకి సుఖీభవ నిధులు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది.

19, జూన్ 2026

SBI PO: 1,500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగాలు

SBI PO: 1,500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి 1,500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తులను జూన్ 18 నుంచి జూలై 8, 2026 వరకు స్వీకరిస్తోంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన, 21-30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికను ప్రిలిమ్స్, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ దశల ద్వారా నిర్వహించి, తుది ఫలితాలను నవంబర్/డిసెంబర్ 2026లో ప్రకటించే అవకాశం ఉంది.

18, జూన్ 2026

థియేటర్లలో ‘పెద్ది’కి కొత్త రచ్చ: రేపటి నుంచి 6 నిమిషాల అదనపు సీన్లు
టాలీవుడ్

థియేటర్లలో ‘పెద్ది’కి కొత్త రచ్చ: రేపటి నుంచి 6 నిమిషాల అదనపు సీన్లు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ భారీ వసూళ్లతో దూసుకుపోతుండగా, మేకర్స్ థియేటర్లలో నిడివిని తగ్గించే బదులు 5 నిమిషాల 56 సెకన్ల కొత్త సీన్లను రేపటి నుంచి జోడిస్తున్నారు. కొన్ని పాత సన్నివేశాలను, ముఖ్యంగా జాన్వీ కపూర్‌కు సంబంధించిన భాగాలను తొలగించి, మరింత ఎమోషనల్, వేగంగా సాగే కొత్త డ్రామాతో రీ-ఎడిట్ చేసిన ఈ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద మరింత హైప్ను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

18, జూన్ 2026

ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన 21 పోస్టులు
ఉద్యోగాలు

ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన 21 పోస్టులు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ఆర్టిజన్ కేటగిరీల్లో మొత్తం 21 ఖాళీలకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడుతున్నారు. బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు నమూనాను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసి, అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి 18.06.2026న హైదరాబాద్‌లో జరిగే వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఈసీఐఎల్ సూచించింది.

17, జూన్ 2026

UPSC నోటిఫికేషన్ విడుదల :  400కు పైగా ఉద్యోగ ఖాళీలు
విద్య

UPSC నోటిఫికేషన్ విడుదల : 400కు పైగా ఉద్యోగ ఖాళీలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026 సంవత్సరానికి సంబంధించిన నియామక నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రత్యక్ష నియామక పథకం కింద 98 రకాల పోస్టులకు 400కు పైగా ఖాళీలను ప్రకటించింది. సాంకేతిక, శాస్త్రీయ, పరిపాలనా, వైద్య, విద్యా రంగాలతో పాటు పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఉద్యోగాలు ఉండగా, ఆసక్తి గల అభ్యర్థులు జూలై 3, 2026 సాయంత్రం 6 గంటల వరకు UPSC ORA పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

15, జూన్ 2026

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,500 అప్రెంటిస్ ఖాళీలు
ఉద్యోగాలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,500 అప్రెంటిస్ ఖాళీలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా 4,500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి, 20-28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు NATS, BFSI SSC పోర్టల్‌ల ద్వారా జూన్ 22, 2026 లోపు ఆన్‌లైన్‌గా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా జరిగి, ఎంపికైన వారికి 12 నెలల శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 స్టైపెండ్ అందుతుంది.

14, జూన్ 2026

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ
టాలీవుడ్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

సినీ నటుడు విజయ్ దేవరకొండ తుమ్మన్‌పేట గృహప్రవేశ వేడుకలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, తన ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా అచ్చంపేట డివిజన్‌లోని 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల 9, 10వ తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు ప్రకటించారు. ఉపకారవేతనాల పంపిణీ వివరాలను త్వరలో వెల్లడించనున్న ఫౌండేషన్‌పై గ్రామస్థులు, అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

14, జూన్ 2026

ఇంజినీరింగ్ విద్యార్థులకు డీఆర్‌డీఓలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు
విద్య

ఇంజినీరింగ్ విద్యార్థులకు డీఆర్‌డీఓలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు

పుణెలోని DRDO ఆధ్వర్యంలోని ARDE 2026-27 విద్యా సంవత్సరానికి 6 నెలలపాటు 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్ 7వ, 8వ సెమిస్టర్ లేదా ఎంటెక్ 1వ, 2వ సంవత్సరం చదువుతున్న, కనీసం 75 శాతం మార్కులు, బ్యాక్‌లాగ్‌లు లేని, 28 ఏళ్లలోపు విద్యార్థులు 2026 జులై 5లోపు స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

12, జూన్ 2026

జూన్ 19న ‘తల్లికి వందనం’ నిధుల జమకు ఏపీ ప్రభుత్వ సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్

జూన్ 19న ‘తల్లికి వందనం’ నిధుల జమకు ఏపీ ప్రభుత్వ సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఈ విద్యా సంవత్సరానికి నిధుల జమ తేదీ జూన్ 12 నుంచి వాయిదా పడింది. దాదాపు 60 లక్షల మందికి పైగా లబ్ధిదారుల అర్హతలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్నందున ఈ ఆలస్యం ఏర్పడింది. తాజా ప్రణాళిక ప్రకారం జూన్ 19న లేదా ఆ తేదీకి సమీపంలో నిధులు జమ చేసే అవకాశముండగా, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యాకే ప్రభుత్వం తేదీని అధికారికంగా ప్రకటించనుంది.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters