రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కూటమి పాలన రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నిర్వహించారు. వార్డు పరిధిలోని ప్రజలను నేరుగా కలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలకు తిరిగి ప్రాధాన్యత కల్పిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ, వారి అభిప్రాయాలు, అవసరాలు, సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ ఇంటింటికీ కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రజలే కుటుంబం.. ప్రజా సంక్షేమమే లక్ష్యం
ఈ నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రజలకు తెలియజేశారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబాన్ని చేరుకోవడం, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రాంతీయ సమతుల అభివృద్ధిని సాధించడం కూటమి లక్ష్యమని ఆయన ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖ వ్యాపార వేత్త బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కొడతాల సూర్యనారాయణ రెడ్డి, చైతన్య యాదవ్, రవి, రామిరెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, పవన్, అభిలాష్, అమీర్, వెంకట రమణ, రవీంద్ర రెడ్డి, నరసింహులు యాదవ్, విష్ణు, P. శ్రీనివాసుల రెడ్డి, రమణా రెడ్డి, తలారి ఓబులేసు, తలారి ప్రవీణ్‌తో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
అలాగే ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, TDP యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Vs ముక్తియార్, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, TDP మాజీ పట్టణ అధ్యక్షులు ఇవి సుధాకర్ రెడ్డి, TDP పట్టణ ఉపాధ్యక్షులు ఖలీల్ భాష, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, BJP పట్టణ అధ్యక్షుడు వంకదార నరేంద్ర రావు, జనసేన నాయకులు సుంకర మురళీ, ప్రసాద్, జిలాన్, మాజీ కౌన్సిలర్లు మురళీధర్ రెడ్డి, కమాల్ బాషా, కాంకర్ గౌస్, ఆంజనేయులు, బాబయ్య, శంకర్ రెడ్డి, రిటైర్డ్ S.i శంకర్, కామిశెట్టి బాబు, కట్టమీది రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.













