ప్రొద్దుటూరు స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణలో భాగంగా జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ ఉమ్మడి కడప జిల్లా ఇంచార్జిగా నియమితులైన గౌరవనీయులు దేవ వరప్రసాద్ ప్రొద్దుటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. జనసేన తరఫున కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.

వార్డ్ వారీగా పార్టీ బలాబలాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలతో సమన్వయం, ప్రతిపక్ష పార్టీల పోటీ పరిస్థితులపై దేవ వరప్రసాద్ వివరాలు తెలుసుకున్నారు. ప్రతి వార్డ్‌లో జనసేనకు ఉన్న బలం, చేయాల్సిన కార్యాచరణ, కూటమి భాగస్వాములతో కలసి చేపట్టాల్సిన వ్యూహంపై ఆయన ఆశావహులతో చర్చించారు.

వార్డ్‌లలో సామాజిక సమీకరణలు, ఓటర్ల వర్గీకరణ, స్థానిక సమస్యల నేపథ్యంలో జనసేన తరఫున కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల నుంచి దేవ వరప్రసాద్ అభిప్రాయాలు, వినతులు స్వీకరించారు. తమకు అవకాశం కల్పిస్తే విజయం సాధించడం తథ్యమని భావిస్తున్న ఆశావహులు తమ వాదనలు, స్థానిక పరిస్థితులను ఆయనకు వివరించారు.

ఈ వివరాలన్నింటిని పార్టీ నాయకత్వానికి తెలియజేసి, కూటమి పార్టీలతో చర్చించి, విజయం సాధించే అవకాశాలు శాతం వందకు చేరేలా అభ్యర్థుల ఎంపిక, వార్డ్ వారీ వ్యూహరచన చేయాలని ఆశావహులు దేవ వరప్రసాద్‌కు అభ్యర్థించారు. స్థానిక స్థాయిలో కూటమి సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాలపై సమగ్ర ప్రణాళిక అవసరమని సమావేశంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేటర్ జివి రమణ, కడప జిల్లా ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్, పండ్ర రంజిత్, అక్కి దాసరి రామారావు, మంచి శివకుమార్, రామోజీ ప్రసాద్, మురళీకృష, Poc శివకళ్యాణ్ రెడ్డి, మంచాల సంజీవ్, మదసు మురళి, షోయబ్, అశోక్, విజయ్, రంగస్వామి, రాము, మధు, నాగేంద్ర, లక్ష్మణ్, పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.