ప్రొద్దుటూరులో జరిగిన సీఎం చంద్రబాబు బహిరంగ సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఆర్టీసీ బస్సుల్లోనే మద్యం పంపిణీ చేసిన ఘటనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సభకు తరలించే బస్సుల్లో మద్యం సరఫరా చేస్తున్న దృశ్యాలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం, బద్వేలు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలను ప్రొద్దుటూరు సభకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో మద్యం ప్యాకెట్లు పంచుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో బస్సులో ప్రయాణికులకు మద్యం బాటిళ్లు, ప్యాకెట్లు అందజేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ కార్యక్రమం బద్వేలు టీడీపీ ఇన్‌చార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సరఫరా జరిగింది. కాశీనాయన మండలం వడ్డమాను పంచాయతీ పరిధిలో ఆర్టీసీ బస్సులోనే మద్యం పంపిణీ జరిగిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మద్యం ఆశ చూపి సీఎం సభకు జన సమీకరణ చేస్తున్నారని ప్రత్యర్థి వర్గాలు విమర్శిస్తున్నాయి.

సీఎం చంద్రబాబు ప్రొద్దుటూరు బహిరంగ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు టీడీపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుల్లో నీటి ప్యాకెట్ల మాదిరిగా మద్యం, వాటర్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేసారని కలకలం రేపుతోంది.

వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో విభిన్న ప్రతిక్రియలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా కార్యక్రమాలకు హాజరయ్యే వారికి మద్యం పంపిణీ చేయడం అనైతికమని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, ఈ వీడియో నిజానిజాలపై సంబంధిత అధికారులు, రాజకీయ నాయకుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

ఆర్టీసీ బస్సుల్లో మద్యం పంపిణీ జరిగిందనే ఆరోపణలపై స్థానికంగా కూడా చర్చ నడుస్తోంది. ప్రభుత్వ రవాణా సదుపాయాన్ని రాజకీయ కార్యక్రమాల కోసం ఈ విధంగా వినియోగించడం సరికాదని పౌర సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మద్యం బాటిళ్లు , వాటర్ పాకెట్స్