బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మద్యం

46 articles

తాగుడుకు బానిస అయ్యే ఏలియన్‌ కథతో ‘ప్లూటో’ ఓటీటీలోకి
ఓటీటీ

తాగుడుకు బానిస అయ్యే ఏలియన్‌ కథతో ‘ప్లూటో’ ఓటీటీలోకి

మలయాళ సైన్స్ ఫిక్షన్‌ కామెడీ అడ్వెంచర్‌ చిత్రం ‘ప్లూటో’లో సూపర్‌ పవర్స్‌ లేని ఏలియన్‌ మద్యం తాగుడుకు బానిసయ్యే వినూత్న కథను చూపించారు. జూలై 30న థియేటర్లలో విడుదలై IMDbలో 6.7 రేటింగ్‌ సాధించిన ఈ సినిమా, ఆగస్టు 24 నుంచి Saina Playలో మలయాళంతో పాటు తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కుటుంబంతో కలిసి సరదాగా చూడదగిన భిన్నమైన సైన్స్ ఫిక్షన్‌గా సినీ వర్గాలు ఈ చిత్రాన్ని సూచిస్తున్నాయి.

25, ఆగ 2026

చంద్రగిరి మద్యం దుకాణంలో వృద్ధుడి మృతి, అనంతపురం జిల్లా వ్యక్తిగా గుర్తింపు
జిల్లా వార్తలు

చంద్రగిరి మద్యం దుకాణంలో వృద్ధుడి మృతి, అనంతపురం జిల్లా వ్యక్తిగా గుర్తింపు

చంద్రగిరి పట్టణంలోని మద్యం దుకాణంలో మద్యం సేవిస్తున్న అనంతపురం జిల్లా కదిరికి చెందిన వెంకటేశ్ అనే వృద్ధుడు అకస్మాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణం పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాతే తెలిసే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.

25, ఆగ 2026

సంబేపల్లి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
జిల్లా వార్తలు

సంబేపల్లి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్లలో ఈశ్వరయ్య హత్య కేసులో రాయచోటి రాయుడు కాలనీకి చెందిన సింహాద్రి, ఫరూక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీరు బాటిల్స్ గాజు ముక్కలు, బండరాయితో దాడి చేసి ఈశ్వరయ్యను హత్య చేసినట్లు డిఎస్పీ కృష్ణ మోహన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో గస్తీని పెంచారు.

25, ఆగ 2026

తిరుమలలో మద్యం, గుట్కా పట్టివేతపై అనుమానాలు వ్యక్తం చేసిన భూమన
జిల్లా వార్తలు

తిరుమలలో మద్యం, గుట్కా పట్టివేతపై అనుమానాలు వ్యక్తం చేసిన భూమన

తిరుమలలో ఇటీవల మద్యం, గుట్కా పట్టివేతలపై స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ అన్నారు. వరుస కేసులు నమోదైనా వివరాలు, కేసు నమోదు తీరుపై పారదర్శకత లేకపోవడంతో భక్తుల్లో ఆందోళన పెరుగుతోందని పేర్కొంటూ, విజిలెన్స్‌ సహా సంబంధిత విభాగాలు సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలు భక్తులకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

24, ఆగ 2026

నంద్యాలలో నాలుగు నెలలకే పెళ్లికొడుకు ఆత్మహత్య
జిల్లా వార్తలు

నంద్యాలలో నాలుగు నెలలకే పెళ్లికొడుకు ఆత్మహత్య

నంద్యాల పట్టణంలో నాలుగు నెలల క్రితం పెళ్లైన రామచంద్ర అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మద్యం సేవనం, ఇతర చెడు అలవాట్లు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబంలో తరచూ కలహాలు జరిగి, మనస్తాపంతో ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

24, ఆగ 2026

శ్రీకాళహస్తి ఎన్టీఆర్‌ నగర్‌లో మైనర్ల హల్‌చల్‌… మద్యం మత్తులో ఆటోపై దాడి
జిల్లా వార్తలు

శ్రీకాళహస్తి ఎన్టీఆర్‌ నగర్‌లో మైనర్ల హల్‌చల్‌… మద్యం మత్తులో ఆటోపై దాడి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎన్టీఆర్‌ నగర్‌లో ముగ్గురు మైనర్లు మద్యం సేవించి ఆటోపై దాడి చేయడంతో ప్రాంతంలో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు వెంటనే చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. యువతలో పెరుగుతున్న మద్యం అలవాటు, మైనర్లకు మద్యం విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

21, ఆగ 2026

తాడిపత్రి వద్ద భారీగా గోవా మద్యం స్వాధీనం
జిల్లా వార్తలు

తాడిపత్రి వద్ద భారీగా గోవా మద్యం స్వాధీనం

తాడిపత్రి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ సమీపంలో తనిఖీల్లో అధికారులు లారీని ఆపి, ప్రత్యేకంగా తయారు చేసిన గుప్త ఖానాల్లో దాచిన దాదాపు 400 ఫుల్ బాటిళ్ల గోవా మద్యం స్వాధీనం చేశారు. రెండు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉపయోగించిన ఈ లారీ ద్వారా గోవా నుంచి తాడిపత్రికి అక్రమ రవాణా చేసినట్లు అనుమానంతో, వాహన యజమాని, డ్రైవర్ వివరాలు సేకరిస్తూ పోలీసులు, ఎక్సైజ్ శాఖ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

19, ఆగ 2026

వేంపల్లి పట్టణంలో డ్రోన్ బీట్‌ నిర్వహించిన పోలీసులు
జిల్లా వార్తలు

వేంపల్లి పట్టణంలో డ్రోన్ బీట్‌ నిర్వహించిన పోలీసులు

కడప జిల్లా వేంపల్లి పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ బీట్ నిర్వహించి ప్రత్యేక నిఘా చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం, శాంతిభద్రతలను భంగం కలిగించే చర్యలను ముందస్తుగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజలు అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

8, ఆగ 2026

పట్టణంలో మద్యం దుకాణాలపై కాంగ్రెస్ ఫిర్యాదు
జిల్లా వార్తలు

పట్టణంలో మద్యం దుకాణాలపై కాంగ్రెస్ ఫిర్యాదు

పులివెందుల నియోజకవర్గంలో పట్టణంలోని బ్రాందీ షాపులు ప్రభుత్వం నిర్ణయించిన సమయాలకు విరుద్ధంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. యువతకు మద్యం సులభంగా అందుబాటులోకి రావడం వల్ల సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

8, ఆగ 2026

మద్యం దుకాణాల్లో ప్లాస్టిక్ వినియోగం నిర్మూలనకు మున్సిపల్ కమిషనర్ చర్యలు
జిల్లా వార్తలు

మద్యం దుకాణాల్లో ప్లాస్టిక్ వినియోగం నిర్మూలనకు మున్సిపల్ కమిషనర్ చర్యలు

ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగం తగ్గింపునకు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథం ప్రత్యేక చర్యలు ప్రారంభించి, మద్యం దుకాణాల్లో ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు వినియోగం వల్ల పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని నిర్వాహకులకు వివరించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పునర్వినియోగ గ్లాసులు, పర్యావరణ హిత వస్తువులు వినియోగించాలని సూచిస్తూ, స్వచ్ఛ సంకల్ప దీక్ష విజయానికి ప్రజలు, వ్యాపార సంస్థలు సహకారం కీలకమని అధికారులు పేర్కొన్నారు.

6, ఆగ 2026

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాల కలకలం
జిల్లా వార్తలు

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాల కలకలం

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాలు, మద్యం వినియోగం, సిరెంజీలు, సిగరెట్ ప్యాకెట్లు పెద్ద ఎత్తున కనిపించడంతో కలకలం రేగింది. నాలుగేళ్లుగా శాశ్వత వార్డెన్ లేకపోవడం, పర్యవేక్షణ లోపం వల్ల హాస్టల్ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ, సమగ్ర విచారణ, కఠిన చర్యలు, శాశ్వత వార్డెన్ నియామకాన్ని డిమాండ్ చేస్తున్నారు.

5, ఆగ 2026

మహిళకు మద్యం తాగించి, బండరాయితో కొట్టి దారుణ హత్య
జిల్లా వార్తలు

మహిళకు మద్యం తాగించి, బండరాయితో కొట్టి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి సమీపంలో ఒక ఘోర కలికలం రేపిన ఉదంతం వెలుగుచూసింది. ఒక మహిళకు మద్యం తాగించి, ఆపై బండరాయితో తలపై మోది అతికిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది

5, ఆగ 2026

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గ్రామస్తుడి మృతి
జిల్లా వార్తలు

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గ్రామస్తుడి మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చట్నీహళ్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామస్థుడు తిక్క స్వామి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్లు గ్రామస్థులు పేర్కొంటూ, మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, డ్రైవర్ పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

3, ఆగ 2026

కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి
జిల్లా వార్తలు

కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో ఓ తండ్రి తన కన్న కొడుకును అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

3, ఆగ 2026

9 నెలల చిన్నారిని చెరువులో ముంచి హత్య
తెలంగాణ

9 నెలల చిన్నారిని చెరువులో ముంచి హత్య

హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్‌ పరిధిలోని బైరామల్ గూడాలో కన్నతల్లి చేతిలోనే 9 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను కలచివేసింది. మద్యం మత్తులో తల్లి చెరువులోకి వెళ్లి శిశువును ముంచినట్లు ప్రాథమిక సమాచారం. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్ గూడాలో ఆదివారం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 9 నెలల చిన్నారిని ఆమె కన్నతల్లి చెరువులో ముంచి ప్రాణాలు తీశిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

3, ఆగ 2026

చింతపర్తి సమీపంలో మహిళ హత్య.. నిందితుడు పరారీలో
జిల్లా వార్తలు

చింతపర్తి సమీపంలో మహిళ హత్య.. నిందితుడు పరారీలో

చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి పరిసరాల్లో మహిళ హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన లక్ష్మీదేవి (48) కూలి పనుల కోసం చింతపర్తికి వచ్చి అక్కడే జీవనం సాగిస్తోంది. స్థానికంగా బొగ్గులు కాల్చే పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

1, ఆగ 2026

కుటుంబ కలహాలతో మహిళ అనుమానాస్పద మృతి: బద్వేల్‌లో విషాదం
జిల్లా వార్తలు

కుటుంబ కలహాలతో మహిళ అనుమానాస్పద మృతి: బద్వేల్‌లో విషాదం

కడప జిల్లా బద్వేల్‌లోని తెలుగు గంగా రోడ్డులో కుటుంబ కలహాల మధ్య హేమలత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. మద్యం సేవించి తరచూ గొడవపడేవాడని భర్త రఘురామిరెడ్డి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హేమలత మృతి ఆత్మహత్యనా, ఇతర కారణాల వలన జరిగిందా అన్న దానిపై పోలీసులు రఘురామిరెడ్డిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

29, జులై 2026

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత జగన్‌ చేస్తున్న ఆరోపణలపై ఆయనతోనే నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

28, జులై 2026

తిరుపతి నగరంలో విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
జిల్లా వార్తలు

తిరుపతి నగరంలో విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

తిరుపతి నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనదారులకు రోడ్డు భద్రత, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, వేగ పరిమితులు, Dial-112 వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

27, జులై 2026

బీదర్  ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి బైక్‌తో దూసుకెళ్లిన యువకులు
కర్ణాటక

బీదర్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి బైక్‌తో దూసుకెళ్లిన యువకులు

కర్ణాటకలోని బీదర్ BRIMS జిల్లా ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు బైక్‌తో నేరుగా దూసుకెళ్లడంతో రోగులు, వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పోలీసులు స్వల్ప బలప్రయోగంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించగా, ఈ ఘటన ఆస్పత్రి భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తి, భద్రతను కట్టుదిట్టం చేయాలన్న డిమాండ్‌ను బలపరిచింది.

26, జులై 2026

సిద్దవటం సమీపంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
జిల్లా వార్తలు

సిద్దవటం సమీపంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సిద్దవటం సమీపంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌.ఐ హారిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీట్ బెల్ట్, హెల్మెట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనం, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగం ప్రమాదాలపై వాహనదారులకు సూచనలు చేస్తూ, ప్రతి పౌరుడు రోడ్డు నియమాలు కచ్చితంగా పాటించాలని పోలీసులు పిలుపునిచ్చారు.

25, జులై 2026

అన్నమయ్య జిల్లాలో రాత్రి ప్రత్యేక నిఘా, గస్తీ ముమ్మరం
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లాలో రాత్రి ప్రత్యేక నిఘా, గస్తీ ముమ్మరం

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నేరాల నివారణ, రోడ్డు భద్రత కోసం పోలీసులు రాత్రివేళ ప్రత్యేక నిఘా, గస్తీ, అదనపు చెక్‌పోస్టులు, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను ముమ్మరం చేస్తున్నారు. రాత్రిపూట సంచరించే అనుమానితుల వేలిముద్రలు సేకరణ, సీసీ కెమెరాల సమీక్ష, "పేస్ వాష్ అండ్ గో" ద్వారా అవగాహన పెంపు వంటి చర్యలతో పాటు, ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద సమాచారం వెంటనే డయల్-100 లేదా 112కు ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

24, జులై 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేరం అంగీకరించిన డేవిడ్ వార్నర్ ..
క్రీడలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేరం అంగీకరించిన డేవిడ్ వార్నర్ ..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్ కోర్టులో నేరం అంగీకరించగా, శిక్ష ఖరారు కోసం ఆగస్టు 18 తేదీని Waverley లోకల్ కోర్ట్ నిర్ణయించింది. డేవిడ్ వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి చట్టబద్ధ పరిమితికి రెట్టింపు కంటే ఎక్కువగా నమోదవడంతో, ఆయన వ్యక్తిగత జీవితం, కెరీర్, ముఖ్యంగా సిడ్నీ థండర్ కెప్టెన్సీ భవిష్యత్తుపై ప్రభావం ఏవుంటాయన్నదిపై క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

22, జులై 2026

మద్యం వ్యసనంపై తగాదా.. కొడుకుని కత్తితో పొడిచిన తండ్రి
నేరాలు

మద్యం వ్యసనంపై తగాదా.. కొడుకుని కత్తితో పొడిచిన తండ్రి

గుంటూరు జిల్లా తెనాలి మండలం నాజరుపేటలో మద్యం వ్యసనం, ఆస్తి వివాదం కారణంగా జరిగిన కుటుంబ కలహం విషాదాంతం అయింది. మద్యం మత్తులో తల్లిదండ్రులను వేధించిన కొడుకుని తండ్రి కత్తితో పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

16, జులై 2026

ఏపీ లిక్కర్ స్కాం.. నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ
నేరాలు

ఏపీ లిక్కర్ స్కాం.. నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్‌కు మూడు రోజుల ఈడీ కస్టడీని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.

16, జులై 2026

మద్యం వేధింపులు తట్టుకోలేక కొడుకును హతమార్చిన తల్లి
జిల్లా వార్తలు

మద్యం వేధింపులు తట్టుకోలేక కొడుకును హతమార్చిన తల్లి

అనంతపురం నగరంలో మద్యం వ్యసనంతో తల్లిదండ్రులను నిరంతరం వేధిస్తున్న సురేంద్ర ఆచారిని, ఆ వేధింపులు తట్టుకోలేక తల్లి సునీతమ్మ కత్తెరతో పొడిచి హతమార్చింది. సంఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, సునీతమ్మను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

15, జులై 2026

తిరుపతిలో మేస్త్రీపై దారుణ హత్యాయత్నం కేసు ఛేదన
జిల్లా వార్తలు

తిరుపతిలో మేస్త్రీపై దారుణ హత్యాయత్నం కేసు ఛేదన

తిరుపతి నగరంలో మేస్త్రీ దాసరి శ్రీనివాసులుపై మద్యం సేవిస్తున్న సమయంలో బైక్‌ ఇవ్వనందుకు ఇద్దరు యువకులు బీరు సీసాలు, బండరాయితో పాశవికంగా దాడి చేసిన కేసును పోలీసులు ఛేదించారు. దాడి వీడియో చిత్రీకరణ, ఆధారాల నాశనంలో సహకరించిన జయవేలు రాజతో పాటు ఉప్పుసెట్టి ఆకాష్‌, రాఘవేంద్రను అరెస్టు చేసి, ద్విచక్ర వాహనం, మూడు చరవాణులను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

15, జులై 2026

నంద్యాల శక్తి టీం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన
జిల్లా వార్తలు

నంద్యాల శక్తి టీం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన

నంద్యాలలో నంద్యాల శక్తి టీం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలు, ప్రయాణికుల ప్రాణ భద్రతపై అవగాహన సెమినార్ నిర్వహించారు. మీటర్ వినియోగం, నిర్దేశిత చార్జీల వసూలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థుల పట్ల మర్యాద, రాత్రి వేళల్లో మహిళా ప్రయాణికుల రక్షణ, చట్టపరమైన నిబంధనలు పాటించకపోతే ఎదురయ్యే సమస్యలపై వివరించారు.

11, జులై 2026

మద్యం మత్తులో మహిళపై ముగ్గురు యువకులు దాడి
జిల్లా వార్తలు

మద్యం మత్తులో మహిళపై ముగ్గురు యువకులు దాడి

చిత్తూరు జిల్లా వి.కోట మండలం సుద్దులకుప్పం గ్రామంలో గురువారం రాత్రి మహిళపై ముగ్గురు యువకులు దారుణంగా దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాటర్ బాటిల్ అప్పు ఇవ్వలేదనే ఆగ్రహంతో మద్యం మత్తులో ఉన్న యువకులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.

10, జులై 2026

రేణిగుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
జిల్లా వార్తలు

రేణిగుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

తిరుపతి జిల్లా రేణిగుంటలో కట్ట పుట్టాలమ్మ గుడి సమీపంలో గుర్తు తెలియని 45-50 ఏళ్ల వ్యక్తి మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. మృతదేహం వద్ద సగం తాగిన మద్యం సీసా ఉండగా, బాహ్య గాయాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. సహజ కారణాలతో మృతి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తూ, మృతుడి గుర్తింపు, ఖచ్చితమైన మరణ కారణం కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

7, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters