రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ రెండు సంవత్సరాల విజయోత్సవ పాలనను పురస్కరించుకుని 45 రోజుల డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ ఫంక్షన్ హాల్ లో అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సులో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్ , యూనిట్ , బూత్ ఇంచార్జి లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ లక్ష్యాలు, అమలు విధానంపై బాధ్యులు కార్యకర్తలకు వివరించారు.
కూటమి ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ చేరవేయాలని నాయకత్వం కార్యకర్తలకు సూచించింది. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరు, అమలు చేసిన పథకాలు, అందించిన ప్రయోజనాలను స్పష్టంగా వివరించాలని ఆదేశించారు.
ఈ 45 రోజుల కార్యక్రమాన్ని సమన్వయంతో, శ్రద్ధతో నిర్వహించి విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలని సమావేశంలో పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటిని చేరుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో కూటమి విజయం సాధించేందుకు ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కీలకంగా ఉపయోగపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటూ, ప్రభుత్వ కార్యక్రమాలను వారికి చేరవేయడం ద్వారా పార్టీ బలపడుతుందని తెలిపారు.
సదస్సు అనంతరం క్యాంపెయిన్‌కు సంబంధించిన బాధ్యతలను క్లస్టర్ , యూనిట్ , బూత్ స్థాయిలో విభజించి, కార్యక్రమం అమలు కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారు. నియోజకవర్గం మొత్తం మీద ఈ ప్రచారాన్ని ఒకే తాటిపై నడిపేందుకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.













