ప్రొద్దుటూరు: పట్టణంలో రూ.10.70 కోట్ల వ్యయంతో చేపడుతున్న 49 అభివృద్ధి పనులకు ఆదివారం స్థానిక MLA వరదరాజులరెడ్డి భూమిపూజ నిర్వహించారు. పట్టణ అభివృద్ధి నిమిత్తం మంజూరైన నిధులతో ఈ పనులను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ 49 పనుల్లో 15th ఫైనాన్స్ గ్రాంట్స్ కింద 47 పనులు, జనరల్ ఫండ్స్ కింద 2 పనులు ఉన్నాయి. పట్టణంలోని పలు కాలనీలు, వీధుల్లో మౌలిక వసతుల మెరుగుదల కోసం ఈ పనులను ప్రణాళికబద్ధంగా చేపట్టినట్లు మున్సిపల్ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రారంభించిన పనుల్లో CC రోడ్లు 28, వాటర్ పైప్ లైన్ వర్క్స్ 12, వాచ్మెన్ రూమ్స్ 3, CC డ్రైన్స్ & కల్వర్ట్స్ 2, ట్రాక్టర్స్ 2, కాంపౌండ్ వాల్ 1, ఫ్లోరింగ్ 1 పని ఉన్నాయి. వీటి ద్వారా రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, మున్సిపల్ సదుపాయాల బలోపేతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

భూమిపూజ కార్యక్రమంలో TDP నేతలు, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా సూచనలు జారీ చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.