రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వై.వి.యు డిగ్రీ నాలుగవ సెమిస్టర్ ఫలితాల్లో ప్రొద్దుటూరు స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ పరిధిలో మొదటి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. వివిధ విభాగాల్లో చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించి కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకువచ్చారు.
బీఎస్సీ హానర్స్ జువాలజీ విభాగంలో ఎస్ సాహే ముస్కాన్, ఎస్ సుహానా, టీఎస్ సబీరా అనే విద్యార్థినులు పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించి యూనివర్సిటీ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ వివరాలను కళాశాల కరెస్పాండెంట్ ఎ. హరి నారాయణ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.
అలాగే నాలుగో సెమిస్టర్ బీఎస్సీ జువాలజీ విభాగంలో ఎస్ గౌసియా, ఎం సుప్రియ 9.85 గ్రేడ్ పాయింట్లు, యు బాలాజీ, రిషిత వైష్ణవి 9.7, వేరోనికా 9.5, అప్సర్ 9.10, ఎన్ఎస్ సుహానా 9.1 గ్రేడ్ పాయింట్లు సాధించినట్లు తెలిపారు. బీఎస్సీ బయోటెక్నాలజీ విభాగంలో అరాస్ 9.4, బ్లేస్సి, శ్వేత 9.25 గ్రేడ్ పాయింట్లు సాధించారు.
బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగం నందు పవిత్ర, దీవెన 9.3, సాదియా 9.1, కే వర్ధన్ యాదవ్ 9 గ్రేడ్ పాయింట్లు సాధించినట్లు కరెస్పాండెంట్ వివరించారు. బీబీఏ విభాగంలో బి లక్ష్మీ ప్రవల్లిక 9.6, జి గురు సౌమ్య 9.2, ఎస్ ఫర్హాన్ 9.1 గ్రేడ్ పాయింట్లు సాధించారు.
బీసీఏ విభాగంలో నాగవల్లిక 9.45, ఎస్ నాగ శ్వేత 9.35, ఎస్ అమీనా, యమునా 9.0 గ్రేడ్ పాయింట్లు సాధించగా, బీకాం కంప్యూటర్స్ విభాగంలో వి ముని అర్షిత 9.35, ఎం మల్లీశ్వరి, వి విష్ణుప్రియ 9.1 గ్రేడ్ పాయింట్లు సాధించినట్లు ఎ. హరి నారాయణ పేర్కొన్నారు.
యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని, విద్యార్థులను కళాశాల డైరెక్టర్ ఎ. పృథ్వి నారాయణ, వైస్ ప్రిన్సిపల్ శారదా భవాని, ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఎం రామ్మోహన్, హెచ్.ఓ.డి లు అజ్రా అజ్మత్, మౌనయ్య, గంగాభవాని, రెడ్డెమ్మ, డీన్ రాజీవ్ అలాగే అధ్యాపక, అధ్యాపకేతర బృందం అభినందించారు.













