ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన గత రెండు సంవత్సరాల పాలన, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలు, భవిష్యత్ లక్ష్యాలపై విశదీకరించారు.

తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వారే అనుభవిస్తున్నారని, ఆస్తుల పంపకం విషయంలో తాను ఎప్పుడూ పశ్చాత్తాపం చెందలేదని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆస్తుల పంపకం సరిగా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి గురైందని, 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రాండ్ Andhra Pradesh ను పునరుద్ధరించామని తెలిపారు.

2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, 2025-26 నాటికి పది సూత్రాలతో ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ను సిద్ధం చేశామని చంద్రబాబు వివరించారు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలియజేయడం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక శాఖలో రెండు సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ఎలాంటి ఎఫర్ట్ పెట్టామనేది అందరికి తెలియాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఇదొక చారిత్రాత్మక ప్రెసెంటేషన్. పాలన బాగుంటే ప్రజల మీద పెద్ద ప్రభావితం చేస్తుంది. నెగటివ్ గవర్నన్స్ ఉంటే నెగటివ్ ప్రభావం చేస్తుంది. 2024లో ఒక అఖండ విజయం సాధించాం. 2019-24లో విధ్వంస పాలన సాగింది. ప్రజలందరూ భయంతో బ్రతికారు. 1982 ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక విప్లవం.. 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చాయి. 2024లో ఊహించని విప్లవం.. ఒక బాధ్యతతో ఎప్పడికప్పుడు ప్రోగ్రెస్ ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాము

2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని, ఆ సమయంలో ప్రజలు భయంతో జీవించాల్సి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1982లో ఎన్టీఆర్ పార్టీ స్థాపన ఒక రాజకీయ విప్లవానికి నాంది పలికిందని, 1994లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లు మాత్రమే వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 2024లో కూడా ఊహించని రాజకీయ మార్పు చోటుచేసుకుందని, ఈ విజయంతో మరింత బాధ్యతతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు.

2014లో బస్సులో ఉండి పరిపాలించాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రయాణించాల్సి వచ్చింది. తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎక్కడా కూడా రెగ్రేట్ ఫీల్ అవ్వలేదు. 2014-19 లో ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మ్ంచుకోవాల్సిన పరిస్థితి లో ఉన్నాము. 2019 లో వచ్చిన పాలనకి ప్రజలు బయటకి రావటానికి భయపడ్డారు. రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి, అభివృద్ధి కుంటుపడింది. 2024 ఎన్నికల్లో ఏవి చెప్పామో అవి చేస్తున్నాము. ఊపిరి పిల్చుకోలేని ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పటికి ఇచ్చిన మాట ప్రకారం డేట్స్ వారీగా అన్ని అమలు చేస్తున్నాము

రాష్ట్ర విభజన అనంతరం 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అత్యవసరమైందని, ఆ సమయంలో పరిపాలనకు ఎదురైన కష్టాలను సీఎం గుర్తుచేశారు. 2019లో ఏర్పడిన ప్రభుత్వ పాలనలో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొన్నదని, రాజధాని అంశంపై స్పష్టత లేకపోవడంతో పెట్టుబడులు, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు.

ప్రస్తుతం ఊపిరి పీల్చుకోలేని స్థాయిలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తేదీల వారీగా అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఆర్థిక శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రం ద్వారా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను, భవిష్యత్ ఆర్థిక దిశను ప్రజలకు స్పష్టంగా చూపించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.