బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఆంధ్ర

359 articles

వరుస నేరాలకు చెక్… రౌడీ షీటర్‌పై పి.డి. యాక్ట్ అమలు
జిల్లా వార్తలు

వరుస నేరాలకు చెక్… రౌడీ షీటర్‌పై పి.డి. యాక్ట్ అమలు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్‌కు చెందిన రౌడీ షీటర్ షేక్ ముజాహిద్ @ ముజ్జు (21)పై వరుస నేరాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం, 1986 ప్రకారం పి.డి. యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. గత రెండు సంవత్సరాల్లో, ముఖ్యంగా ఇటీవలి మూడు నెలల్లో అతనిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదవడంతో, ప్రజాశాంతి పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

9, ఆగ 2026

తిరుపతి జిల్లాలో డ్రగ్స్‌పై దండయాత్ర 2.0
జిల్లా వార్తలు

తిరుపతి జిల్లాలో డ్రగ్స్‌పై దండయాత్ర 2.0

తిరుపతి జిల్లా పోలీసు శాఖ “డ్రగ్స్‌పై దండయాత్ర 2.0” పేరుతో గంజాయి సహా మాదకద్రవ్యాల నిర్మూలనకు విస్తృత చర్యలు చేపడుతోంది. రేణిగుంట సబ్ డివిజన్‌లోని గాజులమాండ్యం ఇండస్ట్రియల్ ఏరియాలో POCL కంపెనీ కార్మికులపై నిర్వహించిన మెగా గంజాయి టెస్టింగ్‌లో 136 మంది పరీక్షించగా, ఎవరూ పాజిటివ్‌గా తేలలేదు. యువత, కార్మికులను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు నిఘా, తనిఖీలు, అవగాహన కార్యక్రమాలను పోలీసులు కొనసాగిస్తున్నారు.

9, ఆగ 2026

సీనియర్ టీచర్లకు కంప్యూటర్ ఆధారిత టెట్  నుంచి మినహాయింపు ఇవ్వాలి: APTF
జిల్లా వార్తలు

సీనియర్ టీచర్లకు కంప్యూటర్ ఆధారిత టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: APTF

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్, ఇన్ సర్వీస్ టీచర్లకు కంప్యూటర్ ఆధారిత టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయులు బోధన అనుభవం, సేవా కాలం ద్వారా అర్హత నిరూపించుకున్నందున వారికి మళ్లీ టెట్ అవసరం లేదని, తప్పనిసరిగా నిర్వహించాల్సి వస్తే కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలో కాకుండా రాత పరీక్షల రూపంలో ఉండాలని ఆయన సూచించారు.

9, ఆగ 2026

గల్ఫ్‌లో ఇరుక్కున్న ఇద్దరు మహిళల ఆర్తనాదం…
జిల్లా వార్తలు

గల్ఫ్‌లో ఇరుక్కున్న ఇద్దరు మహిళల ఆర్తనాదం…

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరు, ఉయ్యూరు ప్రాంతాలకు చెందిన శిరోమణి, పద్మ అనే ఇద్దరు మహిళలు గల్ఫ్‌లోని మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరి పాస్పోర్ట్‌లు అరబ్ షేక్‌ల వద్ద ఉండగా, అదనపు డబ్బు డిమాండ్ కారణంగా స్వదేశానికి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ఇండియన్ ఎంబసీ తక్షణం జోక్యం చేసుకోవాలని బాధితులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

9, ఆగ 2026

రైతులకు ఏపీఎస్పీడీసీఎల్ కొత్త సౌకర్యం: సిఎండి
జిల్లా వార్తలు

రైతులకు ఏపీఎస్పీడీసీఎల్ కొత్త సౌకర్యం: సిఎండి

ఏపీఎస్పీడీసీఎల్ వ్యవసాయ విద్యుత్ సర్వీసు దరఖాస్తుల సీనియారిటీ, ప్రస్తుత స్థితి తెలుసుకునేందుకు మొబైల్ యాప్ ద్వారా కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దరఖాస్తు నంబర్ నమోదు చేస్తే సర్వీసు స్థితి వెంటనే స్క్రీన్‌పై కనిపించేలా వ్యవస్థను రూపొందించారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు తమ ప్రాంత విద్యుత్ కార్యాలయాల్లో దరఖాస్తు నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని సంస్థ తెలిపింది.

8, ఆగ 2026

నంద్యాలలో అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభం
జిల్లా వార్తలు

నంద్యాలలో అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభం

నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల, కళాశాల స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, రాష్ట్రస్థాయి తిరుపతి పోటీలకు ఎంపిక చేసే అవకాశం లభించనుందని అధికారులు తెలిపారు.

8, ఆగ 2026

వివాహానికి హాజరుకావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
జిల్లా వార్తలు

వివాహానికి హాజరుకావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, జిల్లా Telugu Desam Party అధ్యక్షుడు పూల నాగరాజు కుటుంబ సమేతంగా విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి తమ పిల్లల వివాహానికి ఆహ్వానించారు. ఈనెల 30న జరగబోయే వివాహ శుభకార్యానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరగా, ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని స్వీకరించి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

6, ఆగ 2026

మున్సిపల్ కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకోవాలని APMEF వినతిపత్రం
జిల్లా వార్తలు

మున్సిపల్ కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకోవాలని APMEF వినతిపత్రం

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, కుటుంబాల ఆర్థిక రక్షణకు సంబంధించి వినతిపత్రం సమర్పించారు. ప్రతి నెలా వైద్య శిబిరాలు, నియమిత వైద్య పరీక్షలు, విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరగా, కమిషనర్ వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు.

6, ఆగ 2026

అబద్ధాల ప్రజంటేషన్‌తో ప్రజలను మభ్యపెట్టలేరు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
జిల్లా వార్తలు

అబద్ధాల ప్రజంటేషన్‌తో ప్రజలను మభ్యపెట్టలేరు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనపై ఇచ్చిన ప్రజంటేషన్ పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందని, సంక్షేమం, ఉద్యోగాల విషయంలో చెప్పిన గణాంకాలు వాస్తవాలకు విరుద్ధమని ఆరోపించారు. భారీ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఎన్నికల హామీల అమలుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అబద్ధాల పాలనకు ముగింపు రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

6, ఆగ 2026

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 11 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. AUG 15–19 మధ్య వెబ్ ఆప్షన్స్ నమోదు చేసి, 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. కొత్త విద్యా సంవత్సరం తరగతులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి.

5, ఆగ 2026

కర్నూలు జిల్లాలో 77 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జిల్లా వార్తలు

కర్నూలు జిల్లాలో 77 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కర్నూలు జిల్లాలోని 9 ICDS ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 77 అంగన్వాడీ పోస్టుల భర్తీకి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 13 అంగన్వాడీ కార్యకర్త, 64 అంగన్వాడీ ఆయా పోస్టులకు 21–35 ఏళ్ల మధ్య వయస్సు గల, అదే గ్రామంలో నివసించే వివాహిత మహిళల నుండి 5–13 ఆగస్టు 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కొన్ని పోస్టుల నియామకాలు హైకోర్టు తుది ఉత్తర్వులపై ఆధారపడి ఉంటాయని అధికారులు తెలిపారు.

5, ఆగ 2026

మహిళకు మద్యం తాగించి, బండరాయితో కొట్టి దారుణ హత్య
జిల్లా వార్తలు

మహిళకు మద్యం తాగించి, బండరాయితో కొట్టి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి సమీపంలో ఒక ఘోర కలికలం రేపిన ఉదంతం వెలుగుచూసింది. ఒక మహిళకు మద్యం తాగించి, ఆపై బండరాయితో తలపై మోది అతికిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది

5, ఆగ 2026

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో వర్షాలు: పలు జిల్లాలకు APSDMA హెచ్చరికలు
వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో వర్షాలు: పలు జిల్లాలకు APSDMA హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో APSDMA పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉండగా, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA హెచ్చరించింది.

5, ఆగ 2026

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ ఏడాది లక్ష్యాలను వాతావరణ అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచిస్తూ, మడ అడవుల విస్తరణలో రాష్ట్రం దేశంలో ద్వితీయ స్థానం సాధించిందని గుర్తుచేశారు. తీర ప్రాంత రక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో గ్రేట్ గ్రీన్ వాల్, తాటి వనాలు, మడ అడవుల విస్తరణ కీలకమని ఆయన స్పష్టం చేశారు.

5, ఆగ 2026

ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక పరిస్థితులు, 2014-19 పునర్నిర్మాణ ప్రయత్నాలు, 2019-24 విధ్వంసకర పాలన, 2024లో కూటమి విజయం వంటి అంశాలను వివరించారు. బ్రాండ్ Andhra Pradesh పునరుద్ధరణ, ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ రూపకల్పన, 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తేదీల వారీగా అమలు చేస్తూ ప్రభుత్వ ఆర్థిక పనితీరును ప్రజలకు పారదర్శకంగా చూపించడమే శ్వేతపత్రం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

5, ఆగ 2026

టి. చాకిబండ ప్రభుత్వ హైస్కూల్‌లో మంత్రి మండిపల్లి ఆకస్మిక తనిఖీ
జిల్లా వార్తలు

టి. చాకిబండ ప్రభుత్వ హైస్కూల్‌లో మంత్రి మండిపల్లి ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోని టి. చాకిబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించి, తరగతి గదులు, బోధన నాణ్యత, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యార్థుల రవాణా సమస్యలపై ఉపాధ్యాయులు, స్థానికుల వినతికి స్పందించిన మంత్రి, పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

5, ఆగ 2026

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్ట్‌పై అసెంబ్లీ బులిటెన్ విడుదల
జిల్లా వార్తలు

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్ట్‌పై అసెంబ్లీ బులిటెన్ విడుదల

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని ఆగస్టు 2 తెల్లవారుజామున చిప్పగిరిలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి జనరల్ కార్యాలయం విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్‌లో వెల్లడించారు. చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్లు 37/2026, 38/2026 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఆయనపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, మొత్తం 34 మందిపై చర్యలు తీసుకుని, ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.

5, ఆగ 2026

డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం : సీఎం చంద్రబాబు

అన్ని శాఖల్లో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

3, ఆగ 2026

ఏపీ - ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఎంవోయూలు
రాజకీయాలు

ఏపీ - ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఎంవోయూలు

ఆంధ్రప్రదేశ్ - ఆస్ట్రేలియాల మధ్య నాలుగు ఎంవోయూలు కుదిరాయి. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలను కుదుర్చుకున్నారు.

2, ఆగ 2026

కడప ఆర్టీసీ జోన్ నూతన ఈడీగా ఆర్‌ఆర్‌కే కిశోర్ నియామకం
జిల్లా వార్తలు

కడప ఆర్టీసీ జోన్ నూతన ఈడీగా ఆర్‌ఆర్‌కే కిశోర్ నియామకం

APSRTC కడప జోన్ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆర్‌ఆర్‌కే కిశోర్‌ను నియమించారు. ప్రస్తుతం కడప జోన్ ఈడీగా ఉన్న రాఘవకుమార్‌ను విజయవాడ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ, అక్కడ పనిచేస్తున్న కిశోర్‌ను కడప జోన్‌కు పంపారు. గతంలో కడప డిప్యూటీ సీటీఎంగా పనిచేసిన కిశోర్‌పై సేవల మెరుగుదల, ఆదాయ పెంపు, సిబ్బంది సంక్షేమం వంటి అంశాల్లో APSRTC వర్గాలు, సిబ్బంది ఆశలు పెట్టుకున్నారు.

2, ఆగ 2026

స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
జిల్లా వార్తలు

స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్

అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలో తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి, రహదారులు, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలపై ప్రజల వినతులు స్వీకరించారు. ప్రతి వినతిని ఓర్పుగా విని సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఆదేశిస్తూ, ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

2, ఆగ 2026

జిల్లాల్లో ఐటీ మౌలిక వసతుల విస్తరణకు ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభం
జిల్లా వార్తలు

జిల్లాల్లో ఐటీ మౌలిక వసతుల విస్తరణకు ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల్లో ఐటీ మౌలిక వసతుల విస్తరణకు https://itinfra.ap.gov.in పోర్టల్‌ను ప్రారంభించింది అని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లాలోని భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ అంతస్తులు, ఖాళీ భూముల వివరాలను ఉచితంగా నమోదు చేసి పెట్టుబడిదారులకు చేరవేయడం ద్వారా ఐటీ సంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమలను ఆకర్షించి ఉపాధి అవకాశాలు, అదనపు ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఆయన సూచించారు.

2, ఆగ 2026

కేంద్ర పన్నులతో ఏపీ అభివృద్ధి వేగవంతం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కేంద్ర పన్నులతో ఏపీ అభివృద్ధి వేగవంతం : సీఎం చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

2, ఆగ 2026

మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం :మంత్రి నాదెండ్ల మనోహర్..  బ్లాక్ మార్కెట్‌ను అడ్టుకుంటాం..
రాజకీయాలు

మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం :మంత్రి నాదెండ్ల మనోహర్.. బ్లాక్ మార్కెట్‌ను అడ్టుకుంటాం..

మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అడ్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను చాలా వరకు అరికట్టామని స్పష్టం చేశారు.

2, ఆగ 2026

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆగస్టు 6న కీలక సమావేశం..
రాజకీయాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆగస్టు 6న కీలక సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేశాయి. ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు స్పష్టమైన సంకేతాలు అందించారు.

1, ఆగ 2026

సీఎం బాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో సాక్ష్యం: ప్రధాని మోదీ
జాతీయం

సీఎం బాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో సాక్ష్యం: ప్రధాని మోదీ

స్వర్ణాంధ్ర విజన్‌ సాకారానికి కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

1, ఆగ 2026

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు.

1, ఆగ 2026

ఏపీలో ఆచూకీ లేని 44.89 లక్షల మంది ఓటర్లు..:  ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
రాజకీయాలు

ఏపీలో ఆచూకీ లేని 44.89 లక్షల మంది ఓటర్లు..: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం (ఈసీ) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.

31, జులై 2026

భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు
జాతీయం

భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థింసా నృత్యంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.

31, జులై 2026

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మిగనూరులో APWJF నిరసన
జిల్లా వార్తలు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మిగనూరులో APWJF నిరసన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ APWJF ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన జరిగింది. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, పక్కా గృహాలు, 60 ఏళ్లు దాటిన వారికి పింఛన్, అసంఘటిత కార్మికుల హోదా, ప్రత్యేక చట్టం, మీడియా కమిషన్, హైపవర్ కమిటీ,మీడియా అకాడమిక్ గవర్నింగ్ కౌన్సిల్ చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

31, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters