రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
జూన్ నెలలో అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదు కావడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. అలాగే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై విధించే సుంకాలను 500 నుంచి 100 శాతానికి తగ్గించాలని అమెరికా భావించడం కూడా సానుకూలంగా మారింది. ఇక, వరుస నష్టల నేపథ్యంలో మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.11గా ఉంది.
గత సెషన్ ముగింపు (77,054)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్ల లాభంతో 77,554 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 147 పాయింట్ల లాభంతో 24,199 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో బంధన్ బ్యాంక్, హ్యుందాయ్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, యూనో మిండా, ఐఈఎక్స్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). పతంజలి ఫుడ్స్, టాటా ఎలాక్సీ, అదానీ పవర్, టీసీఎస్, హిందాల్కో మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 652 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 359 పాయింట్ల లాభంతో ఉంది.







