రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్: విదేశీ ఉద్యోగాల వీసా ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. మొత్తం 8 మంది నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు విజయవాడ Commissioner of Police వద్ద ఫిర్యాదు చేశారు.
చెన్నైలో ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసే సమయంలో నరేష్ కుమార్ అనే వ్యక్తితో బాధితులకు పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ తర్వాత విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, ఒక్కొక్కరితో లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విదేశీ ఉద్యోగాల కోసం అవసరమయ్యే వీసా, ఇతర ప్రక్రియల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.
డబ్బులు తీసుకున్న తర్వాత బాధితుల పాస్‌పోర్టులు కూడా నరేష్ కుమార్ వద్దకు తీసుకున్నారని, తిరిగి ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాస్‌పోర్టులు ఇవ్వకపోవడంతో విదేశీ ఉద్యోగాల ఆశలు దెబ్బతిన్నాయని, తమ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని బాధితులు పేర్కొన్నారు.
వసూలు చేసిన డబ్బులను నరేష్ కుమార్ ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు బాధితులు ఫిర్యాదులో వివరించారు. తమ నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా, వీసా ప్రక్రియ కొనసాగుతోందని చెప్పి కాలయాపన చేశాడని వారు తెలిపారు. చివరకు ఎలాంటి ఉద్యోగం, వీసా ఏర్పాట్లు జరగకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై బాధితులు సమగ్ర వివరాలతో విజయవాడ కమీషనర్ అఫ్ పోలీస్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులు తిరిగి దక్కేలా చూడాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.
విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు ఇలాంటి మోసపూరిత ఆఫర్లకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెన్సీల ద్వారా మాత్రమే ప్రక్రియలు చేపట్టాలని పోలీసు వర్గాలు సూచిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.







