రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: అక్కినేని కుటుంబానికి చెందిన యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమాతో కెరీర్‌లో తొలి సాలిడ్ హిట్‌ను నమోదు చేశాడు. ఈ చిత్రం ద్వారా ఆయన రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం టాలీవుడ్‌లో మంచి చర్చనీయాంశంగా మారింది. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ విజయంతో అఖిల్ మళ్లీ జోష్ మీదకు వచ్చాడు.
ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అఖిల్ ఇకపై కెరీర్‌లో పెద్ద గ్యాప్‌లు రాకుండా వరుస ప్రాజెక్ట్‌లను సెట్ చేసుకుంటూ జెట్ స్పీడ్‌లో సినిమాలు చేయాలని చూస్తున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని కథలు వినిపించుకుంటున్న అఖిల్, తదుపరి చిత్రంపై దృష్టి సారించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేనితో అఖిల్ చేతులు కలపనున్నాడనే వార్త టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. ‘సేనాపతి’, ‘దయా’ వంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాదినేని, ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
‘ఆకాశంలో ఒక తార’ తర్వాత అఖిల్ అక్కినేని–పవన్ సాదినేని కాంబినేషన్‌లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు దర్శకుడు కథను సిద్ధం చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. అఖిల్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, పవన్ సాదినేని స్టైల్‌లో ఉండే ఈ కథ చాలా వైవిధ్యంగా, కొత్త తరహాలో ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కథ, ఇతర అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, అన్ని విషయాలు ఖరారైన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అఖిల్ తాజా విజయంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అఖిల్–పవన్ సాదినేని కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం జానర్, నటీనటులు, సాంకేతిక బృందం వంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించి క్లియర్ అప్‌డేట్ త్వరలోనే రానుందని, అధికారిక ప్రకటన కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







