దర్శకుడు హోమీ అదజానియా తెరకెక్కించిన బాలీవుడ్‌ చిత్రం ‘కాక్‌టైల్ 2’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి వారాంతానికే ఈ చిత్రం రూ.50 కోట్ల వసూళ్ల మార్క్‌ను దాటేసి వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది.

ఈ వారాంతంలో పెద్ద హిందీ చిత్రాలేవీ థియేటర్లలోకి రాకపోవడం ‘కాక్‌టైల్ 2’కు అదనపు లాభంగా మారింది. పోటీ లేకపోవడంతో మెట్రో నగరాలు, అర్బన్‌ సెంటర్లలో యువత పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలివచ్చారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి ప్రదర్శనలకు మంచి ఆక్యుపెన్సీ నమోదైనట్లు పంపిణీదారులు పేర్కొంటున్నారు.

సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2026లో విడుదలై తొలి వీకెండ్‌లోనే రూ.50 కోట్లకు పైగా వసూలు చేసిన హిందీ చిత్రాలు చాలా కొద్దే. ఆ జాబితాలో ‘కాక్‌టైల్ 2’ కూడా చోటు దక్కించుకుంది. ఈ చిత్రం శుక్రవారం నుంచి ఆదివారం వరకు స్థిరమైన వసూళ్లను నమోదు చేసి, బాక్సాఫీస్‌ వద్ద హాఫ్‌ సెంచరీ కొట్టింది.

అని తరణ్ ఆదర్శ్ ‘ఎక్స్’ వేదికగా వివరించారు. మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా ‘కాక్‌టైల్ 2’ ఈ ఏడాది హిందీ చిత్రాల్లో తొలి వారాంతపు వసూళ్ల పరంగా ముందంజలో నిలిచింది. ప్రస్తుత వేగం కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశముందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌కు మెట్రో నగరాల్లో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో కూడా ఆక్యుపెన్సీ సంతృప్తికరంగా ఉండటంతో, రెండో వారంలోనూ ఈ జోరు కొనసాగుతుందనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు.