రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
ఆగస్టు 21న‘ఇరుముడి’ విడుదల
రవితేజ, నాని సినిమాలకు ఒకే డేట్
ప్రముఖ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ విడుదల తేదీ ఖరారైంది. తన ఇమేజ్‌కు భిన్నంగా రవితేజ నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో నిర్మాణ సంస్థ ‘ఇరుముడి’ స్వరూపం, రవితేజ పాత్ర గురించి వివరాలు వెల్లడించింది. ఈ చిత్రం దైవిక అంశాలతో ముడిపడిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోందని, అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను మలిచినట్లు తెలిపింది. ముఖ్యంగా తండ్రి పాత్రలో రవితేజ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది.
అని మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. రవితేజ భిన్నమైన లుక్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రంలో ప్రియా భవానీశంకర్, సాయికుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ నేపథ్యంతో పాటు ఆధ్యాత్మిక అంశాలు కలగలిపిన కథనంతో సినిమా ముందుకు సాగనుందని సమాచారం.
ఇక మరోవైపు నాని హీరోగా రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ కూడా ఆగస్టు 21నే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ తేదీని ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం ముందుగానే ప్రకటించింది. దీంతో రవితేజ ‘ఇరుముడి’, నాని ‘ది ప్యారడైజ్’ ఒకే రోజున థియేటర్లలోకి రానుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు చిత్రాల అభిమాన వర్గాల్లోనూ ఉత్సాహం నెలకొంది.
అయితే ‘ఇరుముడి’ విడుదల తేదీ అధికారికంగా వెలువడిన తర్వాత ‘ది ప్యారడైజ్’పై కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. ఆగస్టు 21న ‘ఇరుముడి’ రిలీజ్ కాబోతుండటంతో నాని సినిమా వాయిదా పడే అవకాశం ఉందన్న ఊహాగానాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై ‘ది ప్యారడైజ్’ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మొత్తానికి ఆగస్టు 21న రవితేజ, నాని సినిమాలు రెండూ ఒకే రోజున విడుదలైతే, తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ సందడి తప్పదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి పెరుగుతోంది.







