యువ హీరో విశ్వక్ సేన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ, యూత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ మాస్ హీరో ఇప్పుడు మరో ఆసక్తికర కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం వెలువడుతోంది.

తాజా బజ్ ప్రకారం, ‘35 చిన్న కథ కాదు’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు నంద కిషోర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కనుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రకటన వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

విశ్వక్ సేన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, వినోదంతో పాటు బలమైన కథతో ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్. అయితే నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర కీలక వివరాలు మాత్రం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే బయటకు వచ్చే అవకాశముంది.

ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘Cult’ (#Cult) పేరుతో సరికొత్త స్లాషర్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తుండగా, రవి బాసృర్ సంగీత బాధ్యతలు చేపట్టారు.

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న విశ్వక్ సేన్ వరుసగా కొత్త జానర్లను ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో, నంద కిషోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలో అధికారికంగా వివరాలు వెలువడితే, ఈ కాంబినేషన్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.